దాదాపు రెండేళ్ల నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులు అందరూ ఎదురు చూస్తున్న రోజు ఇటీవలే ఐపీఎల్లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో వచ్చింది అన్న విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల క్రితం ఆర్సీబీ కెప్టెన్ గా తప్పుకున్న విరాట్ కోహ్లీ మళ్ళీ కెప్టెన్సీ వైపు తొంగి చూడ లేదు. దీంతో అప్పటి నుంచి డూప్లెసెస్ ఇక బెంగళూరు జట్టును విజయవంతం గా ముందుకు నడిపిస్తున్నాడు అని చెప్పాలి.



 అయితే చాలా గ్యాప్ తర్వాత ఇటీవల విరాట్ కోహ్లీ మళ్ళీ బెంగళూరు జట్టుకు కెప్టెన్ గా మారాడు. డూప్లెసెస్ కి పక్కటెముకలా గాయం కావడం తో ఇక పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో అందు బాటులో లేకుండా పోయాడు. దీంతో చేసేదేమీ లేక విరాట్ కోహ్లీ సారాధ్య బాధ్యతలు చేపట్టి జట్టును ముందుకు నడిపించడం తో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్లో మరో సారి తన కెప్టెన్సీ మార్క్ చూపించిన విరాట్ కోహ్లీ జట్టుకు భారీ విజయాన్ని అందించాడు. ముఖ్యం గా రివ్యూల విషయం  లో విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయాలు అయితే సూపర్ సక్సెస్ అయ్యాయి.



 ఈ క్రమంలోనే ఇటీవలే పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ తీసుకున్న నిర్ణయాలపై మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా జట్టుకు మరింత శక్తిని అందించాడు. అతని డెసిషన్ మేకింగ్ ఎంతో అద్భుతంగా ఉంది. బౌలర్లను క్రమం తప్పకుండా మార్చడం ఒక ఎత్తు అయితే.. పవర్ ప్లే లో హసరంగతో బౌలింగ్ చేయించడం మాత్రం మాస్టర్ స్ట్రోక్  అంటూ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు సరైన సమయంలో రివ్యూలు తీసుకొని కోహ్లీ సూపర్ సక్సెస్ అయ్యాడు అంటూ ప్రశంసించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: