ఈ క్రమంలోనే ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న రవీంద్ర జడేజా సైతం ఇక తన కెరీర్ లో ఎదిగిన తీరును ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ లోనే అటు రవీంద్ర జడేజా మంచి ఆల్రౌండర్ గా ఎదిగాడు అన్న విషయం తెలిసిందే. ఇక భారత జట్టులో కీలక ఆటగాడిగా నిలదొక్కుకున్నాడు. అయితే ఇటీవల కెరియర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక క్రీడా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా మాట్లాడుతూ.. నా క్రికెట్ ప్రయాణం మొత్తం ఇద్దరు మహేంద్రల మధ్య సాగింది అంటూ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇద్దరు మహేంద్రులు ఏంటి జడేజా కేవలం మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ లోనే ఆడాడు కదా అనే కన్ఫ్యూషన్ లో పడిపోయారు కదా. ఇద్దరు మహేంద్రలు అంటే జడేజా చిన్నప్పటి కోచ్ పేరు మహేంద్ర సింగ్ చౌహన్.. ఇక అందుకే జడేజా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. నా చిన్నప్పటి కోచ్ మహేంద్రసింగ్ చౌహన్ తో నా మొదటి అడుగు పడితే.. ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోనితో ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నాను. మొదట నేను ఫాస్ట్ బౌలర్ అవుదాం అనుకున్నాను. కానీ నా హైట్ కి ఫాస్ట్ బౌలర్ అవ్వడం కష్టమని కోచ్ చెప్పడంతో స్పిన్నర్ గా మారాను అంటూ జడేజా చెప్పుకొచ్చాడు.