అదే సమయంలో అటు ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటివరకు ఏ టీం కి సాధ్యం కాని రీతిలో ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన జట్టుగా కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ రెండు జట్ల మధ్య నేడు మ్యాచ్ జరగబోతుంది. అయితే గత ఏడాది లాగానే ఈ ఏడాది కూడా అటు గుజరాత్ టైటాన్స్ జట్టు ఎంతో విజయవంతమైన ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది. ఓడిపోయే మ్యాచ్లలో కూడా అనూహ్యంగా విజయాలు సాధిస్తూ అదరగొడుతుంది అని చెప్పాలి. ఇప్పుడు వరకు ఆరు మ్యాచ్లు ఆడిన గుజరాత్ జట్టు నాలుగు మ్యాచ్లలో విజయం సాధించింది అని చెప్పాలి.
ఈ క్రమంలోనే పాయింట్లు పట్టికలో నాలుగవ స్థానంలో కొనసాగుతూ ఉంది గుజరాత్ టైటాన్స్ జట్టు. అయితే ఎప్పటిలాగానే ఓటమితో ఈ సీజన్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ జట్టు.. ఆ తర్వాత కోలుకోలేకపోయింది. ఇక ఇప్పుడైతే పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది అని చెప్పాలి. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ జట్టు ఆరు మ్యాచ్లు ఆడగా.. మూడింటిలో మాత్రమే విజయం సాధించి పాయింట్లు పట్టికలో ఏడవ స్థానంలో కొనసాగుతూ ఉంది. ఇరు జట్ల బలాబలాలు కూడా సమానంగానే ఉన్నప్పటికీ గుజరాత్ హోమ్ గ్రౌండ్ అయినా అహ్మదాబాద్ లో మ్యాచ్ జరుగుతుండడం ఆ జట్టుకు కాస్త కలిసి వచ్చే అంశం అని చెప్పాలి. ఇక ఎవరు గెలుస్తారు అన్నది చూడాలి మరి.