అయితే గత రెండు మ్యాచ్ల నుంచి మాత్రం ముంబై ఇండియన్స్ అద్భుతంగా పుంజుకుంది అన్నది తెలుస్తుంది. ముఖ్యంగా ఇటీవలే పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో అయితే ఘన విజయాన్ని అందుకుంది. ఇక జట్టులో ఉన్న కీలక బ్యాట్స్మెన్లందరూ కూడా అద్భుతంగా రాణించారు అనడంలో అతిశయోక్తి లేదు. బౌలింగ్ లో కాస్త వీక్ గా కనిపిస్తూ ఉన్నప్పటికీ బ్యాటింగ్లో మాత్రం అదరగొడుతుంది ముంబై ఇండియన్స్. ఇక ఇటీవలే పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్లు చేసిన విధ్వంసం చూసి పాత ముంబై ఇండియన్స్ ను గుర్తు చేసుకున్నారు ఫ్యాన్స్.
అయితే ఈ సీజన్ ఆరంభంలో వరుసగా మూడు మ్యాచ్లలో ఓడిపోయిన ముంబై ఇండియన్స్.. ఆ తర్వాత మాత్రం హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. మధ్యలో మళ్ళీ రెండు మ్యాచ్లలో ఓటమిపాలైన.. ఆ తర్వాత రెండు మ్యాచ్ లలో ఘనవిజయాలను అందుకుంది. ప్రత్యర్థి తమ ముందు 200 కు పైగా పరుగుల టార్గెట్ ను ఉంచినప్పటికీ.. ముంబై ఇండియన్స్ రెండు మ్యాచ్లలో కూడా 200 కు పైగా పరుగులను ఛేదించింది. అయితే ఇలా 200 పరుగులు టార్గెట్ చేదించడం ద్వారా ముంబై ఇండియన్స్ ఒక అరుదైన రికార్డు సృష్టించింది. ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకు ఏ టీం అయినా సరే వరుసగా రెండుసార్లు 200 స్కోర్ లను చేదించి విజయం సాధించడం ఇదే తొలిసారి అని చెప్పాలి.