
మైదానం నలుమూలల ఎంతో సమర్థవంతంగా షాట్లు ఆడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. దీంతో ఇక సూర్య కుమార్ యాదవ్ కు బౌలింగ్ చేసే బౌలర్లు సైతం.. ఎక్కడ బంతి వేయాలో తెలియక ఒత్తిడికి గురవుతూ ఉంటారు అంటే సూర్యకుమార్ విధ్వంసం ఏ రేంజ్ లో కొనసాగుతూ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి విధ్వంసం తోనే టి20 ఫార్మాట్లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం ఫామ్ కోల్పోయి తెగ ఇబ్బంది పడుతూ ఉన్నాడు. మునుపటిలా మెరుపు ఇన్నింగ్స్ లు సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ లో ఎక్కడ కనిపించడం లేదు.
అయితే ఐపీఎల్ లోను ఇలాంటిపేలవమైన ఫామ్ కొనసాగించాడు. ఇటీవలే పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం మరోసారి అదరగొట్టాడు సూర్య కుమార్ యాదవ్. 360 డిగ్రీస్ బ్యాటింగ్ తో వీర విహారం చేసాడు. ఏకంగా పంజాబ్ పై 66 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు రాజస్థాన్ పై కూడా రానించాడు అని చెప్పాలి. దీంతో కొండంత లక్ష్యాన్ని ముంబై అలవోకగా చేదించింది. ఇక సూర్య కుమార్ యాదవ్ 360 డిగ్రీస్ ఆట చూసిన తర్వాత మళ్లీ మైదానంలో సూర్య వీడియో గేమ్ చూపించేశాడు అంటూ ఎంతో మంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.