అజింక్య రహనే : అతను 82 టెస్ట్ మ్యాచ్ లలో 431 పరుగులు చేశాడు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా అతను టెస్ట్ జట్టులో ఒక భాగంగా ఉన్నాడు.టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా అతను ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే చెన్నై మాత్రం అతనిపై నమ్మకం పెట్టుకొని.. ఐపిఎల్ లో ఛాన్స్ ఇచ్చింది. ఈ క్రమంలోనే మెరుపు ఇన్నింగ్స్ లో ఆడుతున్నాడు.
ఇశాంత్ శర్మ : భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మకు కూడా టెస్ట్ క్రికెట్ స్పెషలిస్ట్ బౌలర్గా పేరుంది. అయితే ఇషాంత్ శర్మ గత కొంతకాలంగా టెస్టులకు దూరమైనప్పటికీ.. 2023 ఐపీఎల్ లో ఢిల్లీ జట్టులోకి వచ్చాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో 6.5 ఎకానమీతో ఆరు వికెట్లు పడగొట్టాడు.
రవిచంద్రన్ అశ్విన్ : టెస్ట్ స్పెషలిస్ట్ స్పిన్నర్ గా అశ్విన్ కు మంచి పేరు ఉంది. అయితే అశ్విన్ కూడా టి20లో అదరగొడుతూ ఉన్నాడు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరఫున అశ్విన్ ఆడుతున్నాడు. 7.2 ఎకానమీతో అశ్విన్ 9 మ్యాచ్ లలో 13 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్లో 65 పరుగులు కూడా చేశాడు.
మహమ్మద్ షమీ : మహమ్మద్ షమిని కూడా టెస్ట్ క్రికెట్లో నిపుణుడిగా పరిగణిస్తారు. కానీ ఐపీఎల్లో టి20 ఫార్మాట్లో కూడా షమి సత్తా చాట కలుగుతున్నాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్ లలో షమీ 7.06 ఎకానమీతో 17 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కూడా కొనసాగుతూ ఉన్నాడు.