అయితే ఇలా ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఏకంగా ఒక జట్టు రెండు జట్ల తరపున కాదు ఏకంగా మూడు జట్ల తరఫున ఆడిన ఆటగాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక ప్లేయర్ మరోసారి ఇలాంటి అరుదైన ఘనతను సాధించాడు. ఇటీవలే ముంబై ఇండియన్స్ బౌలర్ ఆర్చర్ జట్టుకు దూరమవడంతో అతని స్థానంలో క్రిస్ జోర్దాన్ కి అవకాశం ఇచ్చింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. ఈ క్రమంలోనే బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో అతను తుది జట్టులో చోటు దక్కించుకొని ఆడాడు.
ఈ క్రమంలోనే అతను ప్రదర్శన పరంగా పెద్దగా ఆకట్టుకోలేక పోయినప్పటికీ.. ఇక ముంబై ఇండియన్స్ తరఫున ఆడటం వల్ల ఒక అరుదైన రికార్డును సాధించాడు అని చెప్పాలి. ఐపిఎల్ హిస్టరీలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు జట్ల తరఫున ఆడిన ఆరో ప్లేయర్గా క్రిస్ జోర్డాన్ అరుదైన ఘనత సాధించాడు. గతంలో టీం సౌదీ, రాబిన్ ఉత్తప్ప, కరన్ శర్మ, ఆడెం మిల్న్నే, పార్థివ్ పటేల్ లు ఇక ఈ మూడు జట్ల తరఫున ఆడి రికార్డు సృష్టించారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు క్రీస్ జోర్డాన్ కూడా వీరి సరసన చేరిపోయాడు. కాగా ముంబై ఇండియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అటు ముంబై ఘన విజయాన్ని అందుకుంది అని చెప్పాలి.