
ఈ సమయంలో లెజెండ్ సునీల్ గవాస్కర్ పరిగెత్తుకుంటూ వెళ్లి తన షర్టుపై ధోనితో ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఈ విషయం గురించి ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు సునీల్ గవాస్కర్. ధోని ఇలా మైదానంలో అభిమానులకు అభివాదం చేస్తున్నప్పుడు నాకు ప్రత్యేకమైన జ్ఞాపకాన్ని సృష్టించాలని అనుకున్నా. అందుకే ధోని ఆటోగ్రాఫ్ కోసం అతని వద్దకు పరిగెత్తాను. ఇక అతను కూడా ఎంతో సంతోషంగా ఆటోగ్రాఫ్ చేశాడు. అది నాకు అత్యంత ఉద్విజ్ఞ క్షణం అంటూ సునీల్ గవాస్కర్ ఎమోషనల్ అయ్యాడు.
అయితే నా అదృష్టం కొద్ది కెమెరా బృందంలో ఒకరి వద్ద మార్కర్ పెన్ కూడా ఉంది. అయితే ఇలా సరైన సమయంలో మార్కర్ ఇచ్చినందుకు కెమెరా మెన్ కు కూడా కృతజ్ఞతలు తెలిపాడు సునీల్ గవాస్కర్. మరో ఎమోషనల్ కామెంట్ కూడా చేశాడు. తాను చనిపోయే చివరి క్షణాల ముందు రెండు విషయాలను గుర్తు చేసుకోవాలని అనుకుంటా అంటూ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. 1983లో కపిల్ దేవ్ ప్రపంచకప్ ను ఎత్తుకోవడం.. ఇక 2011 ప్రపంచ కప్ ఫైనల్లో ధోని చివరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించడం.. గొప్ప క్రికెట్ సందర్భాలు. ఈ రెండు వీడియోలను చూస్తూ నేను నవ్వుతూ ఇక ప్రాణాలు వదులుతాను అంటూ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు.