తనలో దాగివున్న విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ ను మరోసారి బయటకు తెచ్చి అభిమానులందరిలో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపాడు అని చెప్పాలి. ఎందుకంటే మొదటి బంతి నుంచి సిక్సర్లు పోరులతో ఎంతో జోరుగా బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టిన విరాట్ కోహ్లీ.. ఇక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఏకంగా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘనవిజయాన్ని అందుకుంది. ఈ విజయం ద్వారా అటు బెంగుళూరు జట్టు ఏకంగా పాయింట్లు పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది.
ఇకపోతే ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సెంచరీతో అదరగొట్టిన రాయలని ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ.. ఒక అరుదైన రికార్డును సమం చేశాడు. ఐపీఎల్ హిస్టరీ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందు క్రిస్ గేల్ ఆరు సెంచరీలు చేసి అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా ఉండగా.. కోహ్లీ కూడా ఆరు సెంచరీలను 228 ఇన్నింగ్స్ లలో అందుకున్నారు. తర్వాత స్థానంలో బట్లర్ ఐదు సెంచరీలు చేసి ఈ లిస్టులో కొనసాగుతున్నాడు. అయితే విరాట్ కోహ్లీ ఐపీఎల్లో దాదాపు 4 ఏళ్ళ తర్వాత సెంచరీ చేయడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.