ఐపీఎల్ హిస్టరీలో ఛాంపియన్ జట్టుగా మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. 2023 ఐపీఎల్ సీజన్ లోను అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకు చెన్నై ని ఛాంపియన్ టీం అంటారు అన్న విషయాన్ని ప్రతి మ్యాచ్లో గెలవడం ద్వారా నిరూపిస్తూ ఉంది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కొనసాగుతున్న ప్రతి ప్లేయర్ కూడా అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ రికార్డులు కొల్లగొడుతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఈ క్రమంలోనే 2023 ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి కొంతమంది శ్రీలంక క్రికెటర్లు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇలా చెన్నై జట్టులోకి వచ్చిన వారిలో శ్రీలంక బౌలర్ మతిషా పతీరణ కూడా ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇక అతను చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చిన తర్వాత.. ఆ జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేస్తూ ఎక్కువగా పరుగులు కట్టడి చేయడం చేస్తున్నాడు పతీరణ. ఈ క్రమంలోనే అతని బౌలింగ్ పై నమ్మకం ఉంచుతున్న ధోని  ఎక్కువ అవకాశాలు కూడా ఇస్తూ ఉండడం గమనార్హం. ధోని ఇచ్చిన సూచన మేరకు ఇక పరుగులు కట్టడి చేయడమే కాదు కీలకమైన సమయంలో వికెట్లు కూడా పడగొడుతున్నాడు.



 ఈ క్రమంలోనే ఇటీవలే ఒక అరుదైన రికార్డు సృష్టించాడు పతీరణ. ఏకంగా డెత్ ఓవర్ల లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ గా నిలిచాడు అని చెప్పాలి. ఇప్పుడు వరకు డెత్ ఓవర్లలో 26.2 ఓవర్లు బౌలింగ్ చేశాడు పతీరణ. ఈ క్రమంలోనే 16 టికెట్లు పడగొట్టాడు. 12.81 సగటుతో.. 9.8 స్ట్రైక్ రేటుతో.. 7.78 ఎకానమీతో బౌలింగ్ చేశాడు అని చెప్పాలి. అంతేకాదు ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు మొత్తం 65 డాట్ బాల్స్ వేశాడు పతీరణ. అతని అద్భుతమైన బౌలింగ్ తో అటు చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యర్థులను తెగ ఇబ్బంది పెట్టగలిగింది అని చెప్పాలి. అంతేకాదు చెన్నై విజయంలో అతను కీలక పాత్ర వహించాడు. ఇకపోతే ఇటీవల గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించిన చెన్నై జట్టు అటు ఫైనల్ లో అడుగు పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl