
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ సమయంలో చివరి ఓవర్లో ఇది చోటు చేసుకుంది అని చెప్పాలి. 20వ ఓవర్ మహమ్మద్ షమీ వేశాడు. అయితే ఈ ఓవర్లో నాలుగో బంతిని మోయిన్ అలీ మిస్ చేశాడు. అయితే నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న రవీంద్ర జడేజా పరుగు కోసం చిరుత పులిలా పరుగులు తీశాడు. అయితే ఇది గమనించని మోయిన్ అలీ.. ఇక క్రీజు నుంచి కాస్త మెల్లిగా కదిలాడు. అయితే బంతిని అందుకున్న సాహ వికెట్ల వైపు విసరగా అప్పటికే జడేజా తన బ్యాట్ క్రీజు లో ఉంచాడు అని చెప్పాలి. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. జడేజా బ్యాట్ క్రీజు లొ పెట్టే సమయంలో మొయిన్ అలీ ఇంకా అతని వెనకాలే ఉన్నాడు అని చెప్పాలి..
ఒకవేళ కీపర్ సాహ నేరుగా నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు బంతిని విసిరి ఉంటే మాత్రం మోయిన్ అలీ కచ్చితంగా రన్ అవుట్ అయ్యేవాడు. అయితే ఇందుకు సంబంధించిన ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ ఫోటో పై భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. జడేజా చిరుత పులిలా పరిగెత్తుకొస్తూ ఉంటే.. మోయిన్ అలీ మాత్రం ముసలాడీలా పరిగెత్తాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఫన్నీ కామెంట్లను జోడించి ఈ ఫోటోతో మీమ్స్ చేయడం మొదలుపెట్టారు.