ఈ క్రమంలోనే ఇక ఇంగ్లాండులోని ఓవర్ పిచ్ ఎలా ఉండబోతుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒకవేళ ఫేస్ కి అనుకూలించే పిచ్ ఉంటే భారత బ్యాట్స్మెన్లు ఆసిస్ ఫేస్ దళాన్ని తట్టుకోగలరా అని అనుమానాలు కూడా తెరమీదకి వస్తున్నాయ్. ఇలాంటి సమయంలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పిచ్ డాక్టర్ లీజ్ తో మాట్లాడాడు. లీగ్ పిచ్ తయారు చేయడం కీలక పాత్ర వహించాడు. పిచ్ ఎలా స్పందిస్తుంది.. దేనికి అనుకూలంగా ఉంటుంది అనే విషయాలను కూడా ఆయనను అడిగి తెలుసుకున్నాడు అశ్విన్. ఈ వీడియోను తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు.
మేం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మా ఆటగాళ్లకు కొంతమందికి దెబ్బలు తగిలాయి.. మ్యాచ్లో కూడా పరిస్థితి ఇలాగనే ఉంటుందా.. అంటే బంతి బౌన్స్ అవుతుందా.. నేనంటే నీకు ఇష్టం లేదు కదా.. అందుకే స్పిన్ పిచ్ తయారు చేయలేదు అంటూ పిచ్ డాక్టర్ లీజ్ ను అడిగాడు అశ్విన్. ఇక ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ గతంలో నువ్వు ఇక్కడ కౌంటి క్రికెట్ ఆడావు.. ఎన్ని వికెట్లు తీసావ్ అంటూ లీజ్ ప్రశ్నించాడు. 8 వికెట్లు తీశాను అంటూ అశ్విన్ సమాధానం చెప్పి... ఇక్కడ బౌన్సి పిచ్ ఆశించవచ్చా అంటూ ప్రశ్నించగా... తప్పకుండా బౌన్స్ ఉంటుంది నేను గ్యారెంటీ అంటూ పిచ్ డాక్టర్ తెలిపాడు.