ఇక ముందు నుండి అందరూ ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న సీనియర్ బాట్స్మన్స్ స్టివ్ స్మిత్ మరోసారి తన బ్యాడ్ జులిపించి అదరగొట్టాడు. ఏకంగా సెంచరీ తో చెలరేగిపోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ సెంచరీ ద్వారా అరుదైన రికార్డును సృష్టించాడు. ఓవల్ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు స్మిత్ ఓవల్ స్టేడియం లో 512 పరుగులు చేశాడు. ఈ స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన రెండో విదేశీ బ్యాట్స్మెన్ గా నిలిచాడు అని చెప్పాలి.
అయితే ఈ లిస్టులో డాన్ బ్రాడ్మన్ 553 పరుగులతో మొదటి స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు. ఇక స్టీవ్ స్మిత్ తర్వాత అలెన్ బోర్డర్ ఓవల్ మైదానంలో 478 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన మూడో విదేశీ బ్యాటర్ గా కొనసాగుతున్నాడు. ఆ తర్వాత మిచెల్ 448 పరుగులతో నాలుగో స్థానంలో.. రాహుల్ ద్రవిడ్ 443 పరుగులతో ఐదవ స్థానంలో ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే మొదటి ఇన్నింగ్స్ లో చెలరేగిపోయిన ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోర్ చేసింది. ఇక అటు కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మాత్రం 151 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోకి కష్టాల్లో కూరుకుపోయింది.