ఇక ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో కూడా ఇదే జరిగింది అని చెప్పాలి. ఇంగ్లాండులోని ఓవర్ మైదానం వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అయితే నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా భారత్ ముందు 444 పరుగుల టార్గెట్ ఉంచింది. ఈ క్రమంలోనే కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా పట్టుదలతో లక్ష్యాన్ని చేదించే దిశగా పోరాటం సాగిస్తుంది. ఇలాంటి సమయంలో అంపైర్లు తప్పుడు నిర్ణయాలు టీమిండియాకు శాపంగా మారిపోతున్నాయి అని చెప్పాలి. జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న గిల్ అవుట్ విషయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వివాదాస్పదంగా మారిపోయింది.
ఏకంగా కామరూన్ గ్రీన్ క్యాచ్ పట్టిన సమయంలో బంతి నేలకు తాకినప్పటికీ.. కూడా థర్డ్ అంపైర్ దానిని క్లీన్ క్యాచ్గా ప్రకటిస్తూ ఇక గిల్ ను అవుట్ గా ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే ఇలా థర్డ్ అంపైర్ గిల్ ని అవుట్ గా ప్రకటించిన సమయంలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రియాక్షన్ వైరల్ గా మారిపోయింది. ఏకంగా కామరూన్ గ్రీన్ పట్టిన క్యాచ్ ని క్లీన్ క్యాచ్ గా థర్డ్ అంపైర్ నిర్ధారించిన తర్వాత.. రోహిత్ షాక్ లో మునిగిపోయినట్లు కనిపించింది. అంతే కాకుండా ఆ తర్వాత గిల్ ఔట్ సంబంధించి ఇక గ్రౌండ్ లోని అంపైర్లతో రోహిత్ చాలా సేపు చర్చలు జరిపాడు. అయినా ఉపయోగం లేకుండా పోయింది.