
కానీ గత ఏడాది టీ20 వరల్డ్ కప్ ఇక ఈ ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లలోను అటు విశ్వవిజేతగా నిలిచే ఛాన్స్ ను కోల్పోయింది టీమిండియా. లండన్ లోని ఓవల్ మైదానం వేదికగా జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో పటిష్టమైన ఆస్ట్రేలియాను ఎదుర్కోలేక కనీస పోటీ ఇవ్వలేక చేతులెత్తేసింది. దీంతో ఘోర పరాజయమే కాదు అటుటెస్ట్ ఫార్మాట్లో వరల్డ్ కప్ కూడా మిస్సైంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక టీమ్ ఇండియా ప్రదర్శన పై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి.
అయితే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓటమినీ అటు బీసీసీఐ సెలక్టర్లు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రక్షాళనకు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే టెస్ట్ ఫార్మాట్ లో సరైన ప్రదర్శన చేయని చటేశ్వర్ పూజార, ఉమేష్ యాదవ్ లపై వేటు వేయాలని సెలెక్టర్లు నిర్ణయించారట. ఇక వారి స్థానంలో మరికొన్ని రోజుల్లో వెస్టిండీస్తో జరగబోయే టెస్ట్ సిరీస్ లో యంగ్ ప్లేయర్లు యశస్వి జైష్వాల్, ముఖేష్ కుమార్ లకు చోటు కల్పించాలని అనుకుంటున్నారట. అదే సమయంలో ఇక టి20 ఫార్మాట్ కు మోహిత్ శర్మ, రింకు సింగ్, జితేష్ కుమార్, యశస్వి జైష్వాల్ లకు చాన్స్ ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారట.