ఈ క్రమంలోనే ఇక టీమిండియా సెలక్షన్ పై కూడా విమర్శలు వస్తున్నాయి అని చెప్పాలి. టీమిండియా సెలక్షన్ విషయంలో అటు పారదర్శకత లోపించిందని.. సెలక్టర్లు తమకు నచ్చిన ప్లేయర్లకే జట్టులో ఛాన్స్ ఇస్తున్నారని ఇక మంచి ప్రదర్శన చేసి ఫామ్ కనబరిచిన కూడా కొంతమందిని పట్టించుకోవట్లేదు అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. ఇలా జట్టు ఎంపిక విషయంలో పారదర్శకత లేకపోవడం వల్ల టీమిండియా ప్రదర్శన పేలవంగ సాగుతుంది అంటూ కొంతమంది అభిమానులకు కూడా గతంలో సెలెక్టర్లపై విమర్శలు గుప్పించిన సందర్భాలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే ఇక టీమ్ ఇండియా అభిమానులు అందరూ కూడా ఇప్పుడు కొత్త డిమాండ్ ను తెరమీదకి తీసుకువచ్చారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని ఇక భారత జట్టుకు చీఫ్ సెలెక్టర్గా నియమించాలి అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఆటగాళ్ల ఎంపికలో పారదర్శకత ఉండాలి అంటే ఇక ఈ నిర్ణయం తీసుకోవాలి అంటూ బీసీసీఐ ని కోరుతున్నారు. ఇక ధోని ఐపిఎల్ కు గుడ్ బై చెప్పి టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ఎన్సీఏ చైర్మన్గా కోచ్ గా వ్యవహరిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. కాగా కొత్త ఆటగాళ్ల ప్రతిభను గుర్తించడంలో ధోని మంచి ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని కూడా అభిమానులు ప్రస్తావిస్తూ ఉండడం గమనార్హం.