దీనికి ఆకాశ్ చోప్రా స్పందిస్తూ..అవును.. కోహ్లి మరోసారి సారథిగా బాధ్యతలు చేపట్టగల సమర్థుడే.. కానీ.. అతడు ఆ పని చేయడు. ఎందుకంటే.. టెస్టు కెప్టెన్సీ వదులుకోమని ఎవరూ అతడిని ఒత్తిడి చేయలేదు. తనకు తానే ఆ నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి మళ్లీ తను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టకపోవచ్చు. కోహ్లి ప్రకటన తర్వాతే బీసీసీఐ కొత్త కెప్టెన్‌ను నియమించింది. కాబట్టి మళ్లీ విరాట్ కోహ్లి.. నాయకుడిగా తిరిగి రావడం సాధ్యం కాకపోవచ్చు అని అన్నాడు.
కోహ్లీ కెప్టెన్ గా వైదొలిగాక రోహిత్ శర్మ జట్టు నాయకుడయ్యాడు. కోహ్లి, రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు వరుసగా రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినప్పటికీ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. అయితే ఇప్పడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2023 ప్రపంచకప్ పై ఫోకస్ పెట్టారు. ఈసారి వన్ డే వరల్డ్ కప్ భారత్ లోనే జరగనుంది. ఈసారి ఎలాగైనా గెలిచి మరో ప్రంపంచకప్ ని టీం ఇండియాకి ఇవ్వాలని రోహిత్, కోహ్లీ పట్టుదలతో ఉన్నారు. రోహిత్ సేన ప్రస్తుతం వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతోంది. జూలై 12 నుంచి టీం ఇండియా బిజీ కానుంది.