1. గ్రేమ్ స్మిత్
దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాళ్లలో గ్రేమ్ స్మిత్ పేరు ముందు వరుసలో నిలుస్తుంది. బెస్ట్ ప్లేయర్‌గానే కాకుండా బెస్ట్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న ఈ ఆటగాడు కేవలం 22 ఏళ్లకే నేషనల్ టీమ్‌కి నాయకత్వం వహించే అరుదైన అవకాశాన్ని సంపాదించాడు. 2007 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా టీమ్‌ను సెమీఫైనల్ వరకు తీసుకెళ్లాడు కానీ ఫైనాన్స్‌లో చేతులెత్తేసాడు. ఆ సమయంలో ట్రోఫీ చేయి జారిపోగా మళ్లీ 2011 వరల్డ్ కప్‌లో ఈ ఆటగాడు ఆశలు రేకెత్తించాడు. 2011లో సెమీస్ వరకు తీసుకెళ్లాడు కానీ కివీస్ చేతిలో ఓటమి చవి చూశాడు. చివరికి ఆ లెజెండరీ ప్లేయర్ వరల్డ్ కప్ గెలవకుండానే రిటైర్ కావలసి వచ్చింది.
2. బ్రెండన్ మెకల్లమ్
న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్ 2003, 2007, 2011, 2015 వరల్డ్ కప్ టోర్నమెంట్స్‌లో మెరిశాడు. 2007, 2011 వరల్డ్ కప్‌లలో కివీస్ జట్టు సెమీస్ వరకు వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ ఇతడు టీమ్‌లో ఉన్నప్పుడు సౌతాఫ్రికా ట్రోఫీ మాత్రం గెలవలేదు.
3. సౌరవ్ గంగూలీ
2003 వరల్డ్ కప్‌లో సౌరవ్ గంగూలీ సారధ్యంలో టీమిండియా ఫైనల్ వరకు వెళ్ళింది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆస్ట్రేలియా టీమ్ సౌరవ్ గంగూలీకి షాకిస్తూ ఈ ప్రపంచకప్‌లో విజయకేతనం ఎగురవేసింది. ఇది కాక గంగూలీ తన కెరీర్‌లో మూడు వరల్డ్ కప్‌లు ఆడాడు కానీ ప్రతిసారి అతడికి నిరాశే ఎదురయింది.
4. బ్రయాన్ లారా
వెస్టిండీస్ ప్లేయర్ బ్రయాన్ లారా 1992, 1996, 1999, 2003, 2007 ఇలా మొత్తం ఐదు వరల్డ్ కప్‌లలో ఆడాడు కానీ ఒక్క దానిలో కూడా ఆ టీమ్ విజయం సాధించలేదు. ఈ ప్లేయర్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాగా రాణించి జట్టును ముందుకు తీసుకెళ్లాడు కానీ సెమీ ఫైనల్ వరకే ఆ టీమ్ వెళ్ళగలిగింది.
5. రాహుల్ ద్రావిడ్
ఎంతో నేర్పు ఓర్పు గల క్రికెటర్‌గా రాహుల్ ద్రావిడ్ పేరు తెచ్చుకున్నాడు. మ్యాచ్ ఏదైనా సరే పరుగుల వరద సృష్టించడం ఈ ఆటగాడికి వెన్నతో పెట్టిన విద్య. కానీ ఎంత టాలెంట్ ఉన్నా అతడు వరల్డ్ కప్ ముద్దాడ లేకపోయాడు. ఈ స్టార్ ప్లేయర్ కెరీర్‌లో మూడు వరల్డ్ కప్‌లు ఆడాడు. కానీ దురదృష్టం కొద్దీ అతడికి ప్రపంచ కప్ విన్నింగ్ టీమ్‌లో ఉండే అవకాశం లేకుండా పోయింది.
వీరితో పాటు ఏబీ డివిలియర్స్, వకార్ యూనిస్, అనిల్ కుంబ్లే వరల్డ్ కప్ అందుకోలేకపోయారు.