ఈ క్రమంలోనే భారత్ ఆడే మ్యాచ్ల కోసం తటస్థ వేదికను ఏర్పాటు చేయాలి అని ఉద్దేశంతో అటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ కూడా తీవ్రస్థాయిలో చర్చలు జరిపింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైబ్రిడ్ పద్ధతిలో ఆసియా కప్ నిర్వహించేందుకు అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా అనుమతించింది. ఈ క్రమంలోనే భారత్ ఆడబోయే అన్ని మ్యాచ్లను కూడా అటు శ్రీలంక వేదికగా నిర్వహించాలని డిసైడ్ చేశారు. కొన్ని మ్యాచ్లు అటు పాకిస్తాన్ వేదిక కూడా జరగబోతున్నాయి. అయితే ఆసియా కప్ నిర్వహణకు ప్రస్తుతం అన్ని లైన్స్ క్లియర్ అయిన నేపథ్యంలో షెడ్యూల్ విడుదల అయ్యింది. .
కాగా ఆసియా కప్ నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయిన నేపథ్యంలో ఇటీవలే షెడ్యూల్ ను ఆసియా కప్ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసింది అన్నది తెలుస్తుంది. కాగా ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 17 వరకు కూడా టోర్నీ జరగబోతుంది అని చెప్పాలి. కాగా పాకిస్తాన్లో నాలుగు మ్యాచ్లు శ్రీలంకలో 9 మ్యాచులు నిర్వహిస్తారు. పాకిస్తాన్ ఇండియా నేపాల్ ఒక గ్రూప్ లో ఉండగా బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మరో గ్రూప్లో ఉన్నాయి. కాగా ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్లు సూపర్ 4 కి అర్హత సాధిస్తాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే షెడ్యూల్ లో భాగంగా అందరూ ఎదురు చూసే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 2వ తేదీన శ్రీలంక లోని క్యాండి వేదికగా మ్యాచ్ జరుగబోతుంది. ఇక సెప్టెంబర్ 17న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.