ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎంతోమంది ప్లేయర్లు తమ ఆట తీరుతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇలా తక్కువ సమయంలోనే ఏకంగా ప్రతిభ ఉన్న ప్లేయర్లుగా అందరి దృష్టిని ఆకర్షించి అటు టీమిండియాలోకి వచ్చిన వారు కూడా చాలామంది ఉన్నారు. అయితే తన ఆట తీరుతో కాకుండా తన ఓవరాక్షన్ తో ఐపీఎల్లో హాట్ టాపిక్ గా మారిపోయిన క్రికెటర్ ఎవరైనా ఉన్నారు అంటే అతను ఎవరో కాదు రియాన్ పరాగ్ అనే చెప్పాలి  సీనియర్లకు రెస్పెక్ట్ ఇవ్వకుండా చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ ఐపీఎల్లో అతను ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాడు.


 ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ ఉంటాడు. పేరుకు ఆల్ రౌండర్ అనే మాటే గాని అతని బౌలింగ్లో గాని బ్యాటింగ్లో గాని పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఒకవేళ చేసిన అది ఒకటి రెండు మ్యాచ్లకు పరిమితం అయింది తప్ప  అతని ఆట తీరులో పెద్దగా ఎవరిని ఆకట్టుకోలేదు. అలాంటి రియాన్ పరాగ్ ఇక ఐపీఎల్ లో బిల్డప్ బాబాయ్ అనే ఒక విచిత్రమైన ట్యాగ్ ని కూడా సొంతం చేసుకున్నాడు. ఎన్ని విమర్శలు వచ్చిన పట్టించుకోకుండా కాస్త అతిగా ప్రవర్తిస్తూనే ఉంటాడు ఈ యంగ్ ఆల్ రౌండర్.


 ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున పేలవ ప్రదర్శన చేసి విమర్శలు ఎదుర్కొన్న ఇతగాడు.. దేవదర్ ట్రోఫీలో మాత్రం అదరగొడుతూ ఉన్నాడు. ఈస్ట్ జోన్ తరపున ఆడుతున్న ఇతగాడు ఐదు రోజుల వ్యవధిలోనే రెండు సెంచరీలతో అదరగొట్టాడు అని చెప్పాలి. గత నెల 28న నార్త్ జోన్ తో జరిగిన మ్యాచ్లో 102 బంతుల్లో 131 పరుగులు చేసిన సెంచరీ తో ఇరగదీసిన రియాన్ పరాగ్.. ఇక ఈస్ట్ జోన్ తో 68 బంతుల్లో  102 పరుగులు చేసి మరోసారి సెంచరీ చేశాడు. అయితే అటు ఐపీఎల్ రాజస్థాన్ తరపున మాత్రం ఏడు మ్యాచ్లలో ఆడు కేవలం 78 పరుగులు మాత్రమే చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: