ఎందుకంటే టాలెంట్ ఉన్నప్పటికీ అతనికి సరైన అవకాశాలు రావట్లేదు అంటూ ఎంతో మంది క్రికెట్ ఫ్యాన్స్ సెలెక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్దేశపూర్వకంగానే అతనిపై వివక్ష చూపుతున్నారు అంటూ ఇక విమర్శలు గుప్పించారు వెంటనే అతన్ని జట్టులోకి తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు. అయితే ఇక ఇటీవల సెలక్టర్లు సంజూ శాంసన్ కి వెస్టిండీస్ తో జరుగుతున్న టి20 సిరీస్‌లో తుది జట్టులో అవకాశం కల్పించారు. కానీ ఇలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరో సిరీస్‌లో అతని ఎంపిక చేసేలా సెలెక్టరును ఆకర్షించాల్సిన సంజూ శాంసన్ దారుణంగా విఫలమవుతున్నాడు.
దీంతో సంజూ శాంసన్ అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టాలేకపోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో అందరూ చర్చించుకుంటున్నారు వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసి వికెట్ కోల్పోయిన సంజూ శాంసన్ ఇక ఇటీవల జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో ఏడు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. భారీ షాట్ కు ప్రయత్నించి స్టంప్ అవుట్ అయ్యాడు సంజూ శాంసన్. అయితే లేక లేక వచ్చిన అవకాశాలను సంజు సద్వినియోగం చేసుకోలేకపోతు ఉండడంతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది అని చెప్పాలి.