సాధారణంగా ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్ లో లేదా మైదానంలో సరదాగా మాట్లాడుకోవడం చూస్తూ ఉంటాం. కానీ సోషల్ మీడియాలో ప్లేయర్ల మధ్య సంభాషణ జరగడం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. అలాంటిది ఏకంగా సోషల్ మీడియాలో అందరికీ తెలిసేలా ఒకరికి ఒకరు సవాలు విసురుకోవడం. నువ్వా నేనా తేల్చుకుందాం అంటూ ఛాలెంజ్ చేయడం అనేది దాదాపు చూడము అని చెప్పాలి. కానీ కొంతమంది క్రికెటర్లు మాత్రం ఇక సోషల్ మీడియా వేదికగా సరదాగా సంభాషించుకుంటూ సరదాగానే ఒకరికి ఒకరు ఛాలెంజ్ విసరుకోవడం చేస్తూ ఉంటారు.


 ఇక ఇప్పుడూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన ఇద్దరు బౌలర్లు కూడా నువ్వా నేనా అన్నట్లుగా సవాల్ విసురుకోవడం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎవరిది పైచేయి ఒక్క ఓవర్ బౌలింగ్ చేసి తెలుసుకుందామా అంటూ శివం దూబేకు రాహుల్ చాహర్ సవాల్ విసిరాడు. అయితే ఇదంతా సీరియస్గా కాదు కేవలం సరదా కోసమే. తన ఆల్ టైం సీఎస్కే తుదిజట్టును దూబే చెబుతున్న వీడియోను ఆ ఫ్రాంచైజీ  ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అయితే సీఎస్కేకు మాజీ తాజా ఆటగాళ్ళలో 11 మందిని ఎవరిని ఎంపిక చేయాలని ఆలోచిస్తూ దూబే పేర్లు చెబుతూ కనిపించాడు.



 అయితే ఇందులో కొంతమంది ప్లేయర్లను ఎంచుకొని ఇక ధోని కెప్టెన్గా ఎంచుకున్నాడు. చివరికి 11వ ఆటగాడిగా తన పేరును చెప్పుకున్నాడు శివం దూబే. ఈ వీడియో పై సరదాగా స్పందించాడు దీపక్ చాహార్. వచ్చే ఏడాది నువ్వు బౌలర్గా ఆడితే మేము ఇక్కడికి వెళ్లాలి అని కామెంట్ చేశాడు. అయితే వచ్చే ఏడాది ముందుగా మనిద్దరం ఒక్కో ఓవర్ పోరులో తలపెడదాం. నేను నీకు ఒక్కో ఓవర్ బౌలింగ్ చేస్తా.. నువ్వు నాకు ఒక ఓవర్ బౌలింగ్ చెయ్.. ఎవరు పై చేయి సాధిస్తే జట్టులో చోటు సంపాదించుకుంటారో చూద్దాం అని చాహార్ కామెంట్ చేయగా..నీకోసం ఇప్పుడే చోటు ఖాళీ చేస్తున్నా అని రిప్లై ఇచ్చాడు. చోటు కాదు మ్యాచ్ కావాలి అంటూ చాహార్ సరదాగా కామెంట్ చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: