
ఇక మరోవైపు మిగతా భారత బౌలర్లు కూడా అటు ఐర్లాండ్ బ్యాటర్లను తెగ ఇబ్బంది పెట్టారు. ప్రసిద్ కృష్ణ తొలి ఓవర్లో ఏకంగా మంచి బౌలింగ్ వేసాడు. అయితే స్పిన్నర్ రవి బిష్ణయ్ కూడా ఇక అద్భుతంగానే బంతులు వేశాడు. కానీ ఒక్క బౌలర్ మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. అతనే లెఫ్ట్ ఆర్మ్ ఫేసర్ అర్షదీప్ సింగ్. అతని పేలవ ప్రదర్శన కారణంగా ఐర్లాండ్ బ్యాట్స్మెన్లు పరుగుల వరద పారించారు. దీంతో అతనిపై ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే బుమ్రా గాయం కారణంగా భారత జట్టుకు దూరం కావడంతో తర్వాత డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అర్షదీప్ అని అందరూ అప్పట్లో కొనియాడారు.
అయితే ఇప్పుడు వరకు ఎన్నోసార్లు అతను టి20 మ్యాచ్ లలో 20 వ ఓవర్ వేశాడు. ఇక ఇటీవల ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్ లోను చివరి ఓవర్ వేయగా ఐర్లాండ్ బ్యాట్స్మెన్లు చెలరేగిపోయాడు. ఏకంగా ఒకే ఓవర్ లో 22 పరుగులు సమర్పించుకున్నాడు. ఇదంతా చూసిన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇతను ఎక్కడ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.. ఇతను డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ కాదు వేస్ట్ బౌలర్ అంటూ ఏకంగా విమర్శలు చేస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇది అతనికి కొత్త ఏం కాదు గతంలో కూడా చాలాసార్లు చివరి ఓవర్ వేసి ఇలా భారీగా పరుగులు సమర్పించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.