
ఎంత దారుణంగా బదులు చెబుతాడు అంటే కోహ్లీతో ఎందుకు పెట్టుకున్నాం రా బాబు అని కుమిలి కుమిలి పోయేలా రివెంజ్ తీర్చుకుంటూ ఉంటాడు విరాట్ కోహ్లీ. ఈ విషయం దాదాపు క్రికెట్ ఆడుతున్న ప్లేయర్లకు.. క్రికెట్ చూస్తున్న ప్రేక్షకులకు కూడా విధితమే అని చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఎన్నోసార్లు తనను హేళన చేసిన బౌలర్లకు చుక్కలు చూపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇదే విషయం గురించి సౌతాఫ్రికా మాజీ ఆటగాడు మఖాయా ఏన్తిని ఆ జట్టు బౌలర్లకు హెచ్చరికలు జారీ చేశాడు. ఇండియాతో మ్యాచ్లో విరాట్ కోహ్లీని అస్సలు గెలకకండి అంటూ చెప్పకనే చెప్పాడు.
అతని ఒక్క మాట కూడా అనొద్దు. ఒకవేళ నోరు జారితే ఇక అంతే అంటూ వార్నింగ్ ఇచ్చాడు సౌత్ ఆఫ్రికా లెజెండ్. ఒక స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కోహ్లీని స్లెడ్జింగ్ చేస్తే అతను మరింత రెచ్చిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయ్. అందుకే అలాంటి ప్రయత్నాలు చేయకండి అంటూ సౌతాఫ్రికా బౌలర్లకు విజ్ఞప్తి చేశాడు. అతన్ని ఏమీ అనకపోతే బోర్ ఫీల్ అయి అతనే త్వరగా అవుట్ అయిపోతాడు. కోహ్లీకి స్లెడ్జింగ్ అంటే ఎంతో ఇష్టం. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల నుంచి అతను అదే కోరుకుంటాడు. కానీ మీరు అలా చేశారో.. ఇక పరిస్థితి అంతే చివరికి మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది అంటూ సౌత్ ఆఫ్రికా లెజెండ్ ఫేసర్ మఖాయా ఏన్తిని వార్నింగ్ ఇచ్చాడు.