ప్రస్తుతం ఆసియా కప్ లో భాగంగా ఆసియా ఖండంలోని అన్ని జట్లు కూడా హోరాహోరీగా పోరాడుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆసియా కప్ లో విజేతగా నిలవడమె లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఇదిలా ఉంటే అటు మరోవైపు ప్రపంచ క్రికెట్లో ఎన్నో పటిష్టమైన టీమ్స్ కూడా మ్యాచ్ లు ఆడుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇటీవల పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకాగా అటు ప్రపంచ క్రికెట్లో మాత్రం ఇద్దరు భారీ ప్రత్యర్ధులు తలబడ్డారు. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య సౌత్ ఆఫ్రికాన్ వేదికగా మ్యాచ్ జరిగింది అని చెప్పాలి


 నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఈ పోరు అటు క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచింది అనడంలో అతిశయోక్తి లేదు  అయితే ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ విధ్వంసం సృష్టించాడు  ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లతో చెడుగుడు ఆడేశాడు అని చెప్పాలి. అయితే ఇలా న్యూజిలాండ్ ఆటగాడు బాగా రాణించాడు అనగానే అతను బౌల్ట్ అని అందరూ అనుకుంటాడు. కానీ అతను కాదు మిచెల్ శాంట్నర్  తన బౌలింగ్ తో ఫీల్డింగ్ తో హెడ్ లైన్స్ లో నిలిచాడు అని చెప్పాలి  ఏకంగా ఈ మ్యాచ్లో అదిరిపోయే క్యాచ్ పట్టి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు.


 బౌల్ద్ మూడో ఓవర్ తొలి బంతికే జానీ బెయిల్ స్టో ను పెవిలియన్ పంపించాడు. అయితే బౌల్డ్ మిడిల్ స్టాంప్ పైకి బంతిని వేసాడు  ఇది లెన్త్ బాల్ కావడంతో దానిని ఆన్ సైడ్ లో ఆడేందుకు ప్రయత్నించాడు బెయిర్ స్టో. కానీ బంతి అతని బ్యాట్ వెలుపలి అంచును తీసుకొని కవర్స్ లోకి వెళ్ళింది. అయితే అక్కడే సాంట్నర్ ఫీల్డింగ్ చేస్తూ ఉన్నాడు   బంతి అతని తలపైకి వెళ్ళింది. ఈ క్రమంలోనే వెంటనే అప్రమత్తమైన అతను గాల్లోకి దూకి తన ఎడమచేత్తో అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. ఇక అతను పట్టిన క్యాచ్ చూసి బెయిర్ స్టో సైతం నమ్మలేకపోయాడు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియోకాస్త ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: