ఇలా ఇప్పటివరకు ఎన్నోసార్లు అదిరిపోయే ప్రదర్శన చేసి.. భారత జట్టుకు క్లిష్ట పరిస్థితుల్లో విజయాన్ని అందించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అదే సమయంలో తన స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేస్తూ కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ ఉంటాడు ఈ స్టార్ ఆల్ రౌండర్. ఇలా తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఇప్పటికే ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన రవీంద్ర జడేజా.. ఇక ఇప్పుడు మరో అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. ఆసియా కప్ లో భాగంగా జడేజా అదరగొడుతున్నాడు. ఇక ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 10 ఓవర్లు వేసిన రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టాడు. ఈ ఒక్క వికెట్ తో అరుదైన రికార్డ్ అతని ఖాతాలో చేరిపోయింది.
వన్డే ఫార్మాట్లో 200 వికెట్లు పడగొట్టిన ఏడవ భారత బౌలర్గా రికార్డు సృష్టించాడు. అయితే స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కంటే ముందు అనిల్ కుంబ్లే 337, జవగల్ శ్రీనాథ్ 315,అజిత్ అగర్కర్ 288, జహీర్ ఖాన్ 282, హర్భజన్ సింగ్ 269, కపిల్ దేవ్ 253 వికెట్లతో ఈ ఘనత సాధించిన భారత ప్లేయర్లుగా జడ్డు కంటే ముందు ఉన్నారు. అదే సమయంలో వన్ డే ఫార్మాట్లో 2500+ రన్స్ తో పాటు రెండు వందల వికెట్లు తీసిన రెండో భారత ఆల్రౌండర్ గా నిలిచాడు రవీంద్ర జడేజా. జడేజా కంటే ముందు 3783 పరుగులు 253 వికెట్లతో కపిల్ తో మొదటి స్థానంలో ఉన్నాడు.