కానీ పొట్టి ఫార్మాట్లో అలా కాదు క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా మొదటి బంతి నుంచే సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దీంతో ఇక ఈ మెరుపు ఇన్నింగ్స్ ని చూసి అటు ప్రేక్షకులు కూడా మంత్రముగ్ధుల అవుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే మామూలుగా పొట్టి ఫార్మాట్లో ఇలా బ్యాట్స్మెన్లు విధ్వంసం సృష్టించడం గురించి ఎక్కువగా వింటూ ఉంటాం. కానీ కొన్ని కొన్ని సార్లు కొన్ని టీమ్స్ భారీగా పరుగులు చేయాలనే తొందరపాటులో చివరికి అతి తక్కువ పరుగులు చేసిన చెత్త రికార్డును కూడా మూటగట్టుకుంటూ ఉంటాయి అని చెప్పాలి.
ఇటీవల ఇదే జరిగింది. మొన్నటికి మొన్న శ్రీలంక టీం ఆసియా కప్ లో 50 పరుగులకు ఆల్ అవుట్ అయింది అన్న విషయం గురించి మర్చిపోకముందే ఇక ఇప్పుడు మరో టీం 15 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ టి20 లో మంగోలియా జట్టు ఒక చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఏషియన్ గేమ్స్ ఉమెన్స్ క్రికెట్ లో ఇటీవలే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఇండోనేషియా నాలుగు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేయగా.. ఆ తర్వాత భారీ లక్ష్య చేదనకు బరిలోకి దిగిన మంగోలియా 15 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది.