ఈ ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్ మహాసంగ్రామం భారత్ వేదికగా జరుగుతుంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఈ మెగా పోరు ప్రారంభం కాబోతోంది. ఏకంగా ఈ టోర్నీలో పది జట్లు పాల్గొని సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి అని చెప్పాలి. ఎప్పటిలాగానే కొన్ని టీమ్స్ ఇక టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగాయి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్ జట్లు ఇక టైటిల్ ఫేవరెట్ గా ఉన్నాయి అని చెప్పాలి. అయితే సొంత గడ్డం మీద జరుగుతున్న వరల్డ్ కప్ కావడంతో అటు టీమ్ ఇండియాకు ఎన్నోస్పెషల్ అడ్వాంటేజెస్ ఉంటాయి.


 సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచులు కావడంతో ఇక పిచ్ లపై భారత ఆటగాళ్లకు పూర్తి అవగాహన ఉంటుంది. అదే సమయంలో ఇక అటు అభిమానుల నుంచి కూడా భారీగా మద్దతు లభిస్తుంది అని చెప్పాలి. ఇటీవల కాలంలో టీమిండియా బ్యాటింగ్ విభాగం మరింత పటిష్టంగా మారిపోయింది అని చెప్పాలి. ప్రత్యర్థి ఎవరైనా సరే ఎంతో అద్భుతంగా రాణిస్తూ ఉంది. బౌలింగ్ విభాగంలోనూ ఇక తిరుగులేని ప్రదర్శన చేస్తుంది. కానీ ఒకే ఒక సమస్య మాత్రం టీమ్ ఇండియాను తీవ్రంగా వేధిస్తూ ఉంది అని చెప్పాలి.


 దీంతో సొంత గడ్డపై వరల్డ్ కప్ జరుగుతున్న.. ఆ సమస్య తీవ్రతరం అయితే మాత్రం టీమిండియా కు ఓటమి ఖాయమని ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. అదే ఫీల్డింగ్ సమస్య. అత్యుత్తమ ఫీల్డింగ్ ప్రమాణాలను కనబరిచే టీమ్ ఇండియా క్రికెటర్లు ఇటీవల కాలంలో తరచూ క్యాచ్ లను జారవిరుస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం  2019 ప్రపంచ కప్ నుంచి టీమిండియా ఇప్పటివరకు 89 క్యాచ్ లు వదిలేసారూ. ఇక ఆ తర్వాత వెస్టిండీస్ 79, బంగ్లాదేశ్ 65, దక్షిణాఫ్రికా యాభై నాలుగు క్యాచులను వదిలేసింది. దీన్ని బట్టి ఇక భారత్ ఫీల్డింగ్ విషయంలో ఎంత ధారణమైన పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు వరల్డ్ కప్ కూడా ఇదే రిపీట్ అయితే టీమ్ ఇండియా మంచి ప్రస్థానం కొనసాగించడం కష్టమే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: