కోహ్లీ దూకుడు చూసి ప్రత్యర్థి జట్ల ఆటగాళ్ళు సైతం విరాట్ కోహ్లీతో గొడవపడడానికి భయపడుతూ ఉంటారు. వెనకడుగు వేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఎవరైనా ఆటగాడు ఇలా పొరపాటున కోహ్లీ తో గొడవపడ్డారు అంటే చాలు ఏకంగా అతనిపై ఏదో ఒక సమయంలో విరాట్ కోహ్లీ గట్టిగా రివేంజ్ తీర్చుకుంటూ ఉంటారు. అంతేకాదు అటు సోషల్ మీడియాలో కూడా ఫాన్స్ ఇలా కోహ్లీతో గొడవపడ్డ ఆటగాడిని ట్రోల్ చేయడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇలాంటివి తరచూ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం.
ఇలా గత కొంతకాలం నుంచి విరాట్ కోహ్లీ తో గొడవపడి సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురవుతున్న ఆటగాడు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్. ఎప్పుడు కోహ్లీ వికెట్ కోల్పోయిన అతడు తీయటి మామిడి పండ్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ చాలా తీయ్యగా ఉన్నాయి అని విరాట్ కోహ్లీని ఉద్దేశిస్తూ సెటైర్ వేసేవాడు. దీంతో ఇప్పటివరకు కోహ్లీ ఫ్యాన్స్ కూడా చాలా సార్లు అతన్ని ట్రోల్ చేశారు. అయితే వాళ్లు వీళ్లు ట్రోల్ చేయడం కాదు ఏకంగా నవీన్ ఉల్హక్ ఐపీఎల్ ప్రాతినిధ్యం లక్నో ఫ్రాంచైజీ సైతం అతని ట్రోల్ చేసింది. వరల్డ్ కప్ లో భాగంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో లక్నో నవీన్ ఫోటోలు పోస్ట్ చేస్తూ మామిడి పళ్ళు ఎప్పుడు తినకూడదు అంటూ ఒక పోస్ట్ పెట్టింది. ఇలా కోహ్లీ కోసం సొంత ప్లేయర్ని ట్రోల్ చేసింది లక్నో.