అయినప్పటికీ ఇంకా ఏదో సాధించాలనే కసి ప్రతి మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీలో కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి ఆలోచన తీరే అందరిలో కెల్లా అతన్ని ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టింది అని చెప్పాలి. అయితే ఇక టీమిండియాలోకి విరాట్ కోహ్లీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫిట్నెస్ ప్రమాణాల విషయంలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచే విధంగా తన ఫిట్నెస్ ని కాపాడుకుంటూ ఉన్నాడు. అయితే మైదానంలోకి దిగినప్పుడు ఇక విరాట్ కోహ్లీ ఎంత ఎనర్జీతో ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కోహ్లీలో ఇంత ఎనర్జీ ఉండడానికి అతను ఇంత ఫిట్నెస్ గా ఉండడానికి ఇక ఎలాంటి డైట్ ఫాలో అవుతాడని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
అయితే ఇలాంటి విషయాలను దాదాపు క్రికెటర్లు సీక్రెట్ గానే ఉంచుతూ ఉంటారు అనే విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఒక చెఫ్ విరాట్ కోహ్లీ ఫుడ్ మెనూ ఏంటి అన్న విషయాన్ని వెల్లడించాడు. కోహ్లీ ఫుడ్ మెనూనీ లీలా ప్యాలెస్ చెఫ్ అన్షుమన్ బాలి వెల్లడించారు. కోహ్లీ శాకాహారి. ఆవిరితో ఉడికించిన ఆహారాన్ని తీసుకుంటాడు. సోయా, డిమ్ సమ్స్, మాక్ మీట్, టోపు, లీన్ వంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటాడు. ఇక టిఫిన్ కింద మిల్లెట్ దోసె, కినోవా ఇడ్లీలు తింటారు. అయితే కొంతమంది ఇండియన్ క్రికెటర్లు చేపలతో పాటు గ్రిల్ చికెన్ తీసుకుంటారు అంటూ చెప్పుకొచ్చాడు చెఫ్ అన్షుమన్ బాలి.