ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు ఎంత పటిష్టంగా కనిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తుది జట్టులో ఉన్న 11 మంది ఆటగాళ్లు మాత్రమే కాదు.. బెంజ్ పై కూర్చున్న ఆటగాళ్లు కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నారు అన్న దానికి నిదర్శనంగా ఇటీవల జట్టులోకి వచ్చిన షమీ చేస్తున్న ప్రదర్శన నిలిచింది. ఎందుకంటే దాదాపు మూడు మ్యాచ్లపాటు అటు తుది జట్టుకు దూరంగా ఉన్నాడు మహమ్మద్ షమి. సీనియర్ ఆటగాడు అయినప్పటికీ అతన్ని బెంజ్ పైనే కూర్చోబెట్టారు.


 కానీ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం బారిన పడిన తర్వాత ఇక మహమ్మద్ షమీని తుది జట్టులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఇలా మధ్యలో ఛాన్స్ దక్కించుకున్న షమి తన సత్తా ఏంటో నిరూపించాడు. వరుసగా మ్యాచ్ లలో వికెట్లు పడగొడుతూ ఇరగదీస్తూ ఉన్నాడు. అది కూడా ఒకటి రెండు వికెట్లు కాదండోయ్ ఐదు వికెట్ల హాల్ సాధించడమే లక్ష్యంగా అతను మెరుపులాంటి బంతులను విసురుతూ ఉన్నాడు అని చెప్పాలి. అతని స్వింగ్ బౌలింగ్ ముందు ప్రత్యర్థి బ్యాట్స్మెన్లు అందరూ కూడా వికెట్ల సమర్పించుకోవడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నారు.


 న్యూజిలాండ్తో మ్యాచ్లో 5 వికెట్లు సాధించిన షమి ఇంగ్లాండ్ తో మ్యాచ్లో నాలుగు వికెట్లతో అదరగొట్టాడు. ఇక ఇటీవల శ్రీలంకతో మ్యాచ్లో మరోసారి ఐదు వికెట్లు సాధించి సత్తా చాటాడు. ఇలా మూడు మ్యాచ్లలోనే 14 వికెట్లు సాధించాడు అంటే అతని ఫామ్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఇటీవల తన సక్సెస్ కు కారణం ఏంటో చెప్పుకొచ్చాడు. బంతిని సరైన లెంగ్త్ లైన్ లో లయతో వేస్తున్నాను. అదే నా సక్సెస్ కు కారణం. పిచ్ పై సరైన ప్రాంతాల్లో బంతి పడితే అవసరమైన స్వింగ్ వస్తుంది. ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు అంటూ షమి చెప్పకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: