ప్రస్తుతం భారత జట్టు అటు వరల్డ్ కప్ తో బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. సొంత గడ్డమీద జరుగుతున్న వరల్డ్ కప్ కావడంతో టీమిండియా భుజాలపై మరింత బాధ్యత చేరిపోయింది. దీంతో ఇక 140 కోట్ల మంది భారతీయుల కలను సహకారం చేస్తూ ఇక భారత జట్టుకు దశాబ్ద కాలం నుంచి అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ను ముద్దాడాలని భారత జట్టు ఆటగాళ్లందరూ కూడా పోరు కొనసాగిస్తూ ఉన్నారు. ఇక వరల్డ్ కప్ లో భాగంగా వరుసగా విజయం సాధిస్తూ అదరగొడుతున్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే నిర్విరామంగా క్రికెట్ మ్యాచ్లు ఆడుతూ ఇక జట్టును విశ్వ విజేతగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రతి ఒక్క ఆటగాడు చెమటోడ్చి కష్టపడుతున్నారు. అయితే బెంచ్ స్ట్రెంత్ పై ఉన్న ఆటగాళ్లు సైతం అటు ప్రాక్టీస్ లో చెమటోడుస్తూ ఉండడం గమనార్హం. ఇది ఇలా ఉంటే ఇక ఇప్పుడు ఈ వన్డే వరల్డ్ కప్ ముగిసిన వెంటనే.. అటు భారత జట్టు ఒక టి20 సిరీస్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. భారత పర్యటనకు రాబోతున్న ఆస్ట్రేలియా జట్టుతో సొంత గడ్డపై ఈ ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడబోతుంది. అయితే ఈ టి20 సిరీస్ లో కొత్త ఆటగాడు అటు భారత జట్టుకి కెప్టెన్ గా అవతరించబోతున్నాడు అన్నది తెలుస్తుంది.


 ఇటీవల ఆసియా గేమ్స్ లో భారత జట్టును కెప్టెన్గా ముందుకు నడిపించిన రుతురాజై గైక్వాడ్ ఇక ఆస్ట్రేలియాతో జరగబోయే టి20 సిరీస్ కి కూడా కెప్టెన్గా బాధ్యతలు చేపట్టబోతున్నాడట. రోహిత్ శర్మ, హార్దిక్, కోహ్లీ, సూర్యకుమార్, బుమ్రా, సిరాజ్ లాంటి ప్లేయర్లకు వరల్డ్ కప్ ముగిసిన వెంటనే విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాతో జరగబోయే టి20 సిరీస్ కు యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ కి కెప్టెన్సీ ఇవ్వబోతున్నారట. అంతేకాదు ఈ టి20 సిరీస్ లో ప్రస్తుతం వరల్డ్ కప్ కు దూరంగా ఉన్న యువ ఆటగాళ్లందరూ కూడా జట్టులో చేరే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: