ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఒక విషయం గురించి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 ఎడిషన్ లో భాగంగా శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది అన్న విషయం తెలిసిందే. ప్రపంచ క్రికెట్ లో ఎన్నడూ లేని విధంగా ఏకంగా శ్రీలంక ఆల్ రౌండర్ మాథ్యూస్ టైమ్డ్ ఔట్ గా పెవిలియన్ చేరడం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇదే విషయం గురించి క్రీడా ప్రపంచం మొత్తం చర్చించుకుంటుంది.


 ఇది పూర్తిగా క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని కొంతమంది.  అయితే రూల్స్ ప్రకారమే ఇదంతా జరిగిందని మరి కొంతమంది చర్చించుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ క్రికెట్లో ఎప్పుడు కూడా ఇలా టైమ్డ్ అవుట్ జరగలేదు అని విషయం అందరికీ తెలుసు. కానీ క్రికెట్లో మాత్రం ఇలా టైమ్డ్ ఔట్ అనేది కొత్త ఎం కాదు. అంతర్జాతీయ క్రికెట్లో ఇది జరగకపోయినప్పటికీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మాత్రం టైమ్డ్ ఔట్ ఇప్పటికే పలుమార్లు జరిగింది అన్న విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది .


 మొదటిసారి 1987లో ఇలా క్రికెట్లో టైమ్డ్ ఔట్ ద్వారా అవుట్ జరిగింది అని చెప్పాలి. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఆండ్రీ జోర్దాన్ అనే ఆటగాడు వర్షంతో వీధులన్నీ వరదలతో మునిగిపోవడంతో బ్యాటింగ్ కి టైం కి రాలేక టైమ్డ్ ఔట్ అయ్యాడు. 1997లో హేమామూల్ యాదవ్ (త్రిపుర) బౌండరీ అవతల ముచ్చటిస్తూ ఇలా టైమ్డ్ ఔట్ అయ్యాడు. 1919లో హెరాల్డ్ హేగేట్స్ అనే సస్పెక్స్ ఆటగాడు గాయం కారణంగా టైమ్డ్ ఔట్ అయ్యాడు. ఇలా ఫస్ట్ క్లాస్ క్రికెట్ కి టైమ్డ్ ఔట్ అనేది కొత్తేం కాదు   కానీ అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం ఇలా మొదటిసారి జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: