క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అనే మాట అటు క్రికెట్లో చాలా ఎక్కువసార్లు వినిపిస్తూ ఉంటుంది. ఎంతో మంది క్రికెట్ విశ్లేషకులు ఇదే చెబుతూ ఉంటారు. ఎప్పుడైతే ఏ టీం ఎక్కువగా క్యాచ్ లు డ్రాప్ చేస్తుందో.. ఆ టీం కి విజయ అవకాశాలు కూడా అంతే ఎక్కువగా దూరం అవుతాయి అని చెబుతూ ఉంటారు. ఇది నిజమే అన్న విషయం కూడా ఎన్నో సార్లు నిరూపితం అయింది అని చెప్పాలి. అయితే ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా రీసెంట్గా జరిగిన మ్యాచ్ లోను ఇదే జరిగింది. ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఇటీవల మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది..


 కానీ మొదటి నుంచి మ్యాచ్ పరిస్థితులు చూస్తే పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టుపై ఆఫ్ఘనిస్తాన్ ఎంతో అలవోకక విజయం సాధించడం ఖాయం అనే భావన ప్రతి ఒక్కరిలో కూడా వచ్చింది అని చెప్పాలి. ఎందుకంటే 91 పరుగులకే ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది ఆస్ట్రేలియా. దీంతో ఆఫ్గనిస్తాన్ విజయం ఖాయం అని అందరూ అనుకున్నారు. ఇలాంటి సమయంలోనే అటు మాక్స్వెల్ ఒకవైపు తొడ కండరాల నొప్పి వేధిస్తున్న కూడా వీరోచితమైన పోరాటం చేసి విధ్వంసకరమైన డబుల్ సెంచరీ తో ఆస్ట్రేలియాకు విజయం అందించాడు. దీంతో ఆఫ్గనిస్తాన్ విజయం కలగానే మిగిలిపోయింది.


 అయితే ఆఫ్ఘనిస్తాన్ ఓటమికి కారణం ఒక క్యాచ్ వదిలేయడమే. ఇదే విషయం గురించి మాట్లాడాడు ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హస్మతుల్లా షాహిద్. ఈ పరాజయం తీవ్ర నిరాశకు గురి చేసింది అంటూ చెప్పుకోచ్చాడు. మ్యాక్స్వెల్ ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు అంటూ కామెంట్ చేశాడు. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్లో చివరికి ఓటమి తప్పలేదు. బౌలర్లు అద్భుతంగా ప్రారంభించారు. కానీ మాక్స్వెల్ ఇచ్చిన క్యాష్ ను నేలపాలు చేయడమే మా కొంపముంచింది. ఇక వచ్చిన అవకాశంతో మ్యాక్స్ చెలరేగిపోయాడు అంటూ హస్మతుల్లా షాహిది  చెప్పుకొచ్చాడు. కాగా 31 పరుగుల వద్ద మ్యాక్స్వెల్ క్యాచ్ ఇవ్వగా అది మిస్ చేశారు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: