ప్రస్తుతం వరల్డ్ కప్ ఎంత ఆసక్తికరంగా మారిపోయింది. ఏకంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఈ క్రమంలోనే జట్టును గెలిపించేందుకు ఆయా మ్యాచ్లలో ఆటగాళ్లు చూపిస్తున్న తెగువ.. ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది అని చెప్పాలి. ఒకవైపు గాయం నొప్పి వేధిస్తున్న ఇంకోవైపు జట్టును గెలిపించడం కోసం వీరోచితమైన పోరాటం చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న న్యూజిలాండ్,పాకిస్తాన్  జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చేతువేలు విరిగి నొప్పి ఉన్నప్పటికీ కూడా కెన్ విలియమ్సన్ ఏకంగా బ్యాటింగ్లో అదరగొట్టి 95 పరుగులు చేశాడు అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇటీవల ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ఆసీస్ ఆల్ రౌండర్ మ్యాక్స్వెల్ చూపించిన తెగువ క్రికెట్ ప్రపంచాన్ని మొత్తం ఫిదా చేసింది. ఒకవైపు కనీసం సరిగ్గా నడవలేని పరిస్థితి. తొడ కండరాలు పట్టేయడంతో అతను నొప్పితో విలవిలలాడిపోయాడు. అయినప్పటికీ జట్టును గెలిపించాలి అన్న సంకల్పం మాత్రం అతన్ని క్రీజులో నిలబడేలా చేసింది. ఈ క్రమంలోనే నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేసి వెంటనే డబుల్ సెంచరీ సాధించి ఏకంగా జట్టుకు విజయాన్ని అందించాడు. మాక్స్వెల్ తెగువకు క్రికెట్ ప్రపంచం మొత్తం సలాం కొట్టింది.


 కాగా మాక్స్వెల్ వీరోచితమైన ఇన్నింగ్స్ పై భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. జీవితానికి క్రికెట్కు చాలా పోలికలు ఉన్నాయి. కొన్నిసార్లు ఏదైతే మనల్ని వెనక్కి లాగుతుందో అదే ముందుకు తీసుకువెళ్తుంది. సాధారణంగా క్రికెట్లో వివిధ ఫార్మట్లలో వేరు వేరు ఫుట్ వర్కులు అవసరం  మరికొన్నిసార్లు ఎలాంటి ఫుట్ వర్క్ లేకపోవడం కూడా మంచిదే. ఒకవైపు గాయం పెడతా వేధిస్తున్న మంచి సమన్వయంతో మ్యాక్స్వెల్ చరిత్రలో గుర్తుండిపోయే ప్రదర్శన చేశాడు అంటూ సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు. ఇక మరి కొంతమంది మాజీలు కూడా అతనిపై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: