ఇక తర్వాత రిటైర్మెంట్ ప్రకటించడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే అంతర్జాతీయ క్రికెట్లో స్టార్లుగా కొనసాగుతున్న ప్లేయర్లు మాత్రం దాదాపు 40 ఏళ్ళ వరకు కూడా కెరియర్ కొనసాగించాలని అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది ప్లేయర్లు మాత్రం అభిమానుల ఊహకందని రీతిలో అతి తక్కువ సమయంలోనే తమ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించి.. అందరికి షాక్ ఇస్తూ ఉంటారు ఎవరైనా యంగ్ ప్లేయర్ ఇలా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ రిటైర్మెంట్ ప్రకటించారు అంటే చాలు అది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేయర్ ఇలాంటి పని చేసి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న మెగ్ లానింగ్ అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటన చేసింది. ఇదో కఠిన నిర్ణయం. కానీ రిటైర్మెంట్కు నాకు ఇదే సరైన సమయం అని అనిపిస్తుంది అంటూ 31ఏళ్ళ ప్లేయర్ చెప్పుకొచ్చింది. 13 ఏళ్లపాటు ఆస్ట్రేలియా జట్టుకు సేవలు అందించిన ఆమె అన్ని ఫార్మాట్లలో 8 వేలకు పైగా పరుగులు చేసి మహిళా క్రికెట్లో లెజెండ్ గా మారింది అని చెప్పాలి. కాగా మెగ్ లానింగ్ కెప్టెన్సీ లోనే ఆస్ట్రేలియా మహిళా జట్టు ఒక వన్డే వరల్డ్ కప్ తో పాటు నాలుగు టి20 వరల్డ్ కప్లలో కూడా విజేతగా నిలిచింది అని చెప్పాలి.