ఒకవేళ తీసుకున్న రివ్యూ సక్సెస్ అయితే మరో రివ్యూ అదనంగా వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది ఆటగాళ్లు మాత్రం రివ్యూ విషయంలో జాగ్రత్తగా ఉంటే మరి కొంతమంది మాత్రం ఇక అజాగ్రత్తగా రివ్యూ పోగొట్టుకుంటూ ఉంటారు. ఇటీవల న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ఇలాంటిదే జరిగింది. ఈ మ్యాచ్లో అటు న్యూజిలాండ్ జట్టు ఘనవిజయాన్ని అందుకొని సెమీఫైనల్కు మరింత దగ్గర అయింది అన్న విషయం తెలిసిందే.
కాగా ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసింది లంక జట్టు. ఈ క్రమంలోనే ఇన్నింగ్స్ 46వ ఓవర్లో ఫెర్గ్యూసన్ బంతులు వేశాడు. అయితే మూడో బంతికి కరుణరత్నేను పెవిలియన్ పంపించాడు. తర్వాత క్రిజులోకి వచ్చిన చమీరాకు నాలుగో బంతికి ఫుల్ టాస్ సందించాడు. అయితే బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని చ మీరా ప్యాడ్ కు తగిలింది. కానీ న్యూజిలాండ్ ఆటగాళ్లు మాత్రం ఎల్బీ కి అప్పీల్ చేశారు. ఈ క్రమంలోనే ఫస్ట్ స్లీప్ లో ఉన్న డార్లి మిచెల్ మాత్రం కాన్ఫిడెన్స్ తో రివ్యూ తీసుకోమని కెప్టెన్ కేన్ విలియమ్సన్ కు సూచించారు. దీంతో సీనియర్ ఆటగాడి మీద నమ్మకంతో రివ్యూ కి వెళ్ళాడు కెప్టెన్. అయితే రిప్లై లో క్లియర్ గా బాల్ బ్యాట్కు తాగినట్లు కనిపించింది. ఇది చూసిన కివిస్ ప్లేయర్స్ అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇక కెప్టెన్ కేన్ విలియమ్సన్ నవ్వు ఆపుకోలేక తన చేతులతో ముఖాన్ని దాచుకున్నాడు.