అయితే అందరూ అంచనా వేసినట్లుగానే.. అటు భారత జట్టు ప్రస్థానం కూడా కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. వరుస విజయాలు సాధిస్తూ అదరగొడుతుంది ఇప్పటివరకు ఒక్క పరాజయాన్ని కూడా చవి చూడలేదు. తొమ్మిది మ్యాచ్ లు ఆడితే అన్నింటిలో కూడా టీమిండియానే పైచేయి సాధించి విజయ డంకా మోగించింది. అయితే టీమిండియా విజయాలను చూసి అటు దాయాది దేశమైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మాత్రం అసలు ఓర్వలేకపోతున్నారు. ఈ క్రమంలోనే సంచలన ఆరోపణలు చేస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇలా భారత జట్టు పై పాకిస్తాన్ మాజీ ప్లేయర్లు చేస్తున్న ఆరోపణలపై భారత మాజీ వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్ అయ్యాడు.
ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2003 నుంచి వన్డే ఫార్మాట్లో ఆరు ప్రపంచ కప్ లు జరిగాయి. ఇందులో ఇండియా ఐదు సార్లు సెమీఫైనల్కు క్వాలిఫై అయింది. అయితే పాకిస్తాన్ మాత్రం కేవలం ఒక్కసారి మాత్రమే సెమీఫైనల్ లో అర్హత సాధించింది. ఇక ఇప్పుడు టీమ్ ఇండియా బాగా రాణిస్తూ ఉంటే.. బంతులు, పిచ్ లను మారుస్తున్నారని ఐసీసీ బీసీసీఐ పై నిందలు వేస్తున్నారు. మేము ఇతర టీం లపై ఓడితే పాకిస్తాన్ ప్రధాని ఆనందం వ్యక్తం చేస్తారు. ఇలా వాళ్లు మనల్ని ద్వేషిస్తూ ప్రేమను ఆశిస్తారు. కానీ అలా జరగదు ప్రతి యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది అంటూ వీరేంద్ర సెహ్వాగ్ కౌంటర్ ఇచ్చాడు.