అక్టోబర్ 5వ తేదీన ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన వరల్డ్ కప్ టోర్ని క్రికెట్ ప్రేక్షకులందరికీ ఎంతలా ఎంటర్టైన్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఎన్నో టీమ్స్ విషయంలో అటు ప్రేక్షకుల అంచనాల మొత్తం తారుమారు అయింది. ఎవరు ఊహించని టీమ్స్ అటు వరల్డ్ కప్ సెమి ఫైనల్లో అడుగుపెట్టాయి అన్న విషయం తెలిసిందే. అయితే రేపటి నుంచి సెమి ఫైనల్ మ్యాచ్ లు జరగబోతున్నాం. ఈ వరల్డ్ కప్ టోర్ని చివరి దశకు చేరుకోగా..  ఎవరు టైటిల్ విజేతగా నిలుస్తారు అనే చర్చ కూడా జరుగుతుంది.


 ఇదే విషయం గురించి ఎంతోమంది మాజీ ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఇక తమ అంచనాలను రివ్యూల రూపంలో చెప్పేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే సొంత గడ్డపై వరల్డ్ కప్ టోర్నీ ఆడుతూ సూపర్ ఫామ్ లో కనిపిస్తూ ఇప్పటికే లీక్ దశలో అజేయంగా నిలిచిన భారత జట్టే.. ఈసారి టైటిల్ గెలుస్తుంది అని ఎంతోమంది మాజీలు అభిప్రాయ పడుతూ ఉండగా.. ఇక ఇటీవల నెదర్లాండ్స్ ప్లేయర్ వాన్ డర్ మెర్వ్ మాత్రం మరో కొత్త టీం పేరు చెప్పాడు. ఆస్ట్రేలియానే వరల్డ్ కప్ టైటిల్ విజేతగా నిలుస్తుంది  అంటూ కామెంట్ చేశాడు.



 దీంతో ఇక నెదర్లాండ్స్ ప్లేయర్ వాన్డర్ మెర్వ్ చేసిన కామెంట్స్ కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఐదు సార్లు వరల్డ్ కప్ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా ఎప్పటికీ ప్రమాదకరమే అంటూ అభిప్రాయం వ్యక్తం చేసాడు ఈ క్రికెటర్. అయితే తొలుత భారత జట్టు చాలా సమతూకంగా ఉంది అంటూ తెలిపాడు. తన అభిప్రాయం ప్రకారం మాత్రం తప్పకుండా ఆస్ట్రేలియానే వరల్డ్ కప్ గెలిచి తీరుతుంది అంటూ అభిప్రాయపడ్డాడు ఈ డచ్ క్రికెటర్. కాగా ఆస్ట్రేలియా జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలవడంతో రెండో సెమీఫైనల్ మ్యాచ్లో అటు సౌత్ ఆఫ్రికా తో తలబడబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: