అయితే ప్రస్తుతం ఫ్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్గా కొనసాగుతూ ఉన్నాడు. ఇక జట్టును ఎంతో విజయపతంలో ముందుకు నడిపిస్తున్నాడు. ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో కూడా ఆస్ట్రేలియా జట్టును సెమీఫైనల్కు చేరడంలో కమీన్స్ తనదైన సారథ్యంతో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. అయితే ఇక వచ్చే ఏడాది జరగబోయే 2024 వరల్డ్ కప్ నాటికి అటు ఆస్ట్రేలియా జట్టుకు కొత్త కెప్టెన్ రాబోతున్నాడు అందరూ తెలుస్తుంది. ఏకంగా ఆ జట్టులోని స్టార్ ఆల్ రౌండర్ కు సారధ్య బాధ్యతలు అప్పగించబోతున్నారట.
టి20 వరల్డ్ కప్ 2024 సమయానికి ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్గా మిచెల్ మార్ష్ వ్యవహరించే అవకాశం ఉంది అన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం టి20 జట్టుకు మాజీ నాయకత్వం వహిస్తున్నారు. దీంతో టి20 వరకు అతని ఫుల్ టైం కెప్టెన్ గా నియమించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా.. కొనసాగుతున్న ఈ ఆటగాడు మూడు ఫార్మాట్లలో కూడా కీలక ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. వన్డే ప్రపంచ కప్ లో కూడా అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు. ఇప్పటివరకు అతను రెండు సెంచరీలు కూడా చేశాడు. మొత్తంగా 426 పరుగులు చేశాడు. కాగా ప్రస్తుతం అతను రెగ్యులర్ కెప్టెన్ దూరమైన సమయంలో తాత్కాలిక కెప్టెన్గా ఆస్ట్రేలియాని ముందుకు నడిపిస్తున్నాడు.