ప్రపంచ క్రికెట్లో పటిష్టమైన జట్టుగా కొనసాగుతుంది టీమిండియా. ఇక ప్రత్యర్థి టీమ్స్ ఎంత పటిష్టంగా ఉన్నా అలావోకగా చిత్తు చేసి భారీ విజయం సాధించగల సత్తా భారత జట్టుకుంది. ఈ విషయాన్ని ఇప్పటికే వరల్డ్ కప్ లో కూడా నిరూపించింది భారత జట్టు. ఇక లీగ్ దశలో ఏకంగా 9 మ్యాచ్ లలో కూడా విజయం సాధించి అదరగొట్టింది అని చెప్పాలి. అలాంటి టీమిండియా  ఎలాంటి జట్టునైనా సరే ఎంతో సులభంగా ఎదుర్కోగలదు. కానీ వరల్డ్ క్రికెట్లో భారత జట్టుకు అతి కఠినమైన సవాలును విసిరే ప్రత్యర్థి ఎవరు అంటే ప్రతి ఒక్కరు కచ్చితంగా న్యూజిలాండ్ పేరు చెబుతూ ఉంటారు.



ఎందుకంటే ఇప్పటివరకు వరల్డ్ క్రికెట్లో ఉన్న అన్ని పటిష్టమైన టీమ్స్ పై అటు భారత జట్టు ద్వైపాక్షిక సిరీస్లలో మాత్రమే కాదు వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలలో కూడా పైచేయి సాధించింది. కానీ అటు ఎప్పుడు అండర్ డాగ్స్ గా బరిలోకి దిగే న్యూజిలాండ్ జట్టు విషయంలో మాత్రం టీమిండియా పెద్దగా మంచి గణాంకాలను దక్కించుకోలేకపోయింది. ఒక రకంగా చెప్పాలి అంటే టీమిండియా పై న్యూజిలాండ్ దే పైచేయిగా కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి 2023 వన్డే వరల్డ్ కప్ లో న్యూజిలాండ్, టీమ్ ఇండియా మధ్య సెమి ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. దీంతో ఏం జరగబోతుందో అనే ఉత్కంఠ సగటు క్రికెట్ ప్రేక్షకుడిలో ఉండిపోయింది.


 నేడు సెమీఫైనల్ లో ప్రత్యర్థిగా ఉన్న న్యూజిలాండ్ జట్టు గురించి కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్ ప్రత్యర్థుల వ్యూహాలను బాగా అర్థం చేసుకోగలరు అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇక అంతేకాకుండా ఆ టీం అత్యంత క్రమశిక్షణ కలిగిన జట్టు. ఆ టీం ప్లేయర్స్ స్మార్ట్ క్రికెట్ ఆడుతారు. ప్రత్యర్ధుల మెంటాలిటీని కూడా బాగా అర్థం చేసుకుంటారు. ఐసీసీ టోర్నీలో సెమీస్, ఫైనల్స్ లాంటి నాకౌట్ మ్యాచ్ లలో న్యూజిలాండ్ స్థిరంగా రాణిస్తోంది అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: