నేటితరం క్రికెటర్లలో ఎప్పుడూ అత్యుత్తమ ఫామ్ కొనసాగిస్తూ పరుగుల వరద పారించే క్రికెటర్లు ఎవరు అంటే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ముక్తకంఠంగా చెప్పేస్తూ ఉంటారు అతను ఎవరో కాదు విరాట్ కోహ్లీ అని. భారత జట్టులో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ గతంలో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను కూడా నిర్వహించాడు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత ఫామ్ కోల్పోవడంతో కెప్టెన్సీ వదిలేసి ఇక బ్యాటింగ్ పై దృష్టి పెట్టాడు. ఇక ఇప్పుడు సూపర్ ఫామ్ లో కొనసాగుతూ సెంచరీలతో చెలరేగిపోతున్నాడు.


 మిగతా క్రికెటర్లతో పోల్చి చూస్తే విరాట్ కోహ్లీ కాస్త భిన్నమైన వాడు. ఎందుకంటే సాధారణంగా ప్రతి బ్యాట్స్మెన్ కూడా ప్రత్యర్ధులు ఇచ్చిన భారీ టార్గెట్ ను చేదించే సమయంలో ఒత్తిడికి లోనవుతూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏదో ఒక మిస్టేక్ చేసి వికెట్ కోల్పోవడం చేస్తూ ఉంటారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం చేజింగ్ అంటే చాలు పూనకం వచ్చినట్లుగా ఊగిపోతూ ఉంటాడు. మొదట బ్యాటింగ్ చేసినప్పుడు అయినా కాస్త తడబాటు కనిపిస్తుందేమో కానీ చేజింగ్ చేసేటప్పుడు మాత్రం అతని బ్యాటింగ్ తో ప్రేక్షకులందరిని ఫిదా చేసేస్తూ ఉంటాడు. అందుకే అతన్ని చేజింగ్ కింగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు.


 ఇదే విషయం గురించి భారత యంగ్ ఓపెనర్ గిల్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలో సాదరణంగానే కోహ్లీకి గిల్ కు మధ్య ప్రత్యేక అనుబంధం కనిపిస్తూ ఉంటుంది. ఇక రికార్డుల చేదనలోనూ ఇద్దరిదీ ఒకే శైలి. అయితే కోహ్లీ గురించి మీ అభిప్రాయం ఏంటి అని గిల్ ను ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ లో పరుగుల పట్ల ఆకలి ఆటలో తీవ్రత ఉంటాయి. గ్రౌండ్లో వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి ప్రత్యేకంగా సాధించాలి అనుకుంటాడు. గత 15 ఏళ్ల నుంచి కూడా ఆకలిని ఆటలో తీవ్రతని అలాగే మైంటైన్ చేస్తున్నాడు. అదే కోహ్లీలో నాకు స్ఫూర్తి అంటూ చెప్పుకొచ్చాడు యంగ్ ఓపెనర్ గిల్.

మరింత సమాచారం తెలుసుకోండి: