
కానీ అందరి ఆశలు.. అడియాశలుగానే మిగిలిపోయాయి అని చెప్పాలి. ఎలాగైతే గతంలో ఆస్ట్రేలియా జట్టు భారత జట్టును దెబ్బ కొట్టిందో.. ఇక 2023 వన్ డే వరల్డ్ కప్ లో కూడా అలాగే దెబ్బకొట్టి ఇక టైటిల్ను ఎగరేసుకుపోయింది. అయితే ఈసారి ఏకంగా సొంత గడ్డ మీదనే భారత జట్టుకు చేదు అనుభవం ఎదురు కావడం గమనార్హం. ఈ క్రమంలోనే ఈ ఏడాదిలోనే భారత జట్టు ఏకంగా ఐసీసీ టోర్నిలలో రెండుసార్లు ఆస్ట్రేలియా చేతిలో ఏకంగా కోలుకోలేని రీతిలో ఓడిపోయింది. అయితే లీగ్ మ్యాచ్లు అదరగొట్టిన భారత ప్లేయర్లు ఆఖరి పోరులో మాత్రం ఇక ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కోవడంలో విఫలం కావడంతో భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు.
అయితే ఈ వరల్డ్ కప్ ట్రోఫీలో 765 పరుగులతో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా.. ఇక 24 వికెట్లతో మహమ్మద్ షమి అత్యధిక వికెట్ టేకర్ గా ఉన్నప్పటికీ టీమిండియా ట్రోఫీ గెలవడంలో మాత్రం విఫలమైంది అని చెప్పాలి. అయితే ఈ ఏడాది జూన్లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లోను అటు భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా సొంత గడ్డం మీదే మరో ఐసిసి ట్రోఫీ భారత్ చేతిలోకి వచ్చింది అని అందరూ ఫిక్స్ అవ్వగా.. ఇక ఆస్ట్రేలియా ఫైనల్ లో గెలిచి ఒక్కసారిగా లాగేసుకుంది.