ఈ క్రమంలోని ప్రస్తుతం క్రికెట్లో ఐసీసీ కొత్త రూల్ ప్రవేశపెట్టింది అన్నది తెలుస్తుంది. సాధారణంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక ఓవర్ పూర్తయిన తర్వాత మరో బౌలర్ తో బంతులు వేయించడానికి కెప్టెన్ కాస్త ఎక్కువ సమయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎంత సమయంలోపు మరో బౌలర్ బంతిని సంధించాలి అనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి నిబంధన లేదు అని చెప్పాలి. దీంతో కొన్ని కొన్ని సార్లు ఇలా బౌలింగ్ చేసే సమయంలో ఆయా జట్లు సుదీర్ఘ సమయం తీసుకుంటూ ఉంటాయ్. దీంతో మ్యాచ్ లు ఆలస్యంగా ముగుస్తున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం.
ఇలాంటి పోకడకు స్వస్తి పలికేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఏకంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎక్కడా సమయం వృధా కాకుండా ఉండేందుకు సరికొత్త రూల్ను తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే స్టాప్ క్లాక్ తో ఓవర్ల మధ్య వ్యవధిని నియంత్రించే విధానాన్ని ఐసిసి పరిగణిస్తుంది. అయితే బౌలింగ్ టీం మూడుసార్లు 60 సెకండ్లలో తర్వాత ఓవర్ ప్రారంభించకా పోతే.. అయితే ఏకంగా ఐదు పరుగులను పెనాల్టీ విధిస్తారు అంపైర్లు . ఈ డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు కూడా ఈ కొత్త రోల్ ని ప్రయోగాత్మకంగా ఐసిసి క్రికెట్లో ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైంది అని చెప్పాలి.