సాధారణంగా ఏ బ్యాట్స్మెన్ అయినా సరే డెత్ ఓవర్ లలో బ్యాటింగ్ చేయడానికి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ రింకు సింగ్ మాత్రం డెత్ ఓవర్లలోనే చెలరేగిపోతూ ఉన్నాడు. ఏకంగా సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతూ స్కోరు బోర్డుకు సైతం ఆయాసం వచ్చేలా బ్యాటింగ్ చేస్తున్నాడు. దీంతో అతను టీమిండియాకు నయా ఫినిషర్ అంటూ అందరూ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. భారత జట్టుకు ఫినిషిర్ సమస్య తీరిపోయిందని ఇంకా రింకు సింగ్ ఫ్యూచర్ స్టార్ అవుతాడంటూ ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే రింకు సింగ్ బ్యాటింగ్ పై అటు ఆశిష్ నెహ్ర మాత్రం షాకింగ్ కామెంట్స్ చేశాడు. టి20 ఫార్మాట్ లో అదరగొడుతున్న రింకు సింగ్ కి ఫినిషర్ ట్యాగ్ నూ జోడించవద్దు అంటూ టీమిండియా మాజీ బౌలర్ ఆశిష్ నెహ్ర సూచించాడు. రింకు మంచి ఇన్నింగ్స్ లు ఆడటం కొత్త కాదు. ఫీల్డింగ్ లో కూడా అతను ఎంతో చురుకుగా ఉంటున్నాడు. ఇక త్వరలోనే వన్డే ఫార్మాట్లోకి కూడా అతని ఎంట్రీ ఇస్తాడు. అయితే అతనికి ఏ స్థానంలో అయినా ఆడే సత్తా ఉంది. ఇక భవిష్యత్తులో అతన్ని టాప్ ఆర్డర్లో ఆడిస్తే ఏమని పిలవాలి.. అందుకే ఇప్పుడే ఫినిషర్ అనే ట్యాగ్ ఇవ్వద్దు అంటూ ఆశిష్ నెహ్ర సూచించాడు.