బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐపీఎల్ అనే టోర్నీని నిర్వహిస్తుంది. ఒక సాదాసీదా దేశీయ లీగ్ గా ప్రారంభమైన ఈ టోర్నీ ప్రపంచ క్రికెట్లో ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు వరల్డ్ క్రికెట్లో రిచెస్ట్ లీగ్ గా కూడా కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఐపీఎల్ టోర్నీ ఇక అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాలి అనుకునే ఎంతోమంది యువ ఆటగాళ్లకు ఒక మంచి వేదిక మారిపోయింది. అయితే అచ్చం ఐపీఎల్ తరహా లోనే ఉమెన్స్ క్రికెట్ ని కూడా ప్రోత్సహించే విధంగా బీసీసీఐ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో నిర్వహిస్తోంది.


 గత ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సూపర్ సక్సెస్ అయింది అన్న విషయం తెలిసిందే. అయితే అచ్చం ఐపీఎల్ తరహాలోనే ఎంతోమంది మహిళా క్రికెటర్లు కూడా వేలంలో కోట్ల రూపాయల ధర పలికారు. ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇక ఇప్పుడు2024 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నిర్వహణకు సంబంధించి సన్నహాలు జరుగుతున్నాయి. ఇటీవల వేలం కూడా ముగిసింది అన్న విషయం తెలిసిందె. అయితే ఇక మహిళల ప్రీమియర్ లీగ్ ని ఎక్కడ ఎప్పుడు నిర్వహిస్తారు అనే విషయంపై మాత్రం అందరిలో ఆసక్తి ఉంది.


 కాగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ నిర్వహణ కోసం బీసీసీఐ నాలుగు వేదికలను పరిశీలిస్తుంది అన్నది తెలుస్తోంది. లక్నో, ఖాన్పూర్, చెన్నై, బెంగళూరు వేదికలను భారత క్రికెట్ నియంత్రణ మండలి పరిశీలిస్తుందట. అయితే లక్నో లేదా కాన్పూర్ లోనే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఇందులో ఏదో ఒక వేదికను బీసిసిఐ త్వరలోనే ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయట. కాగా ఇటీవలే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కి సంబంధించిన వేలం ముగియగా.. ఈ వేలంలో కాశ్మీ గౌతమ్ ను ఏకంగా రెండు కోట్లకు గుజరాత్ దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wpl