సాదరణం గా క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న ఆటగాడు ఎంతో బాధ్యతాయుతం గా ఉండాలి. జట్టును ఎంతో విజయవంతం గా ముందుకు నడిపించి విజేతగా నిలపాలి. ఎన్నో ట్రోఫీలను గెలిపించాలి. ఇలా ఒక కెప్టెన్ గా సక్సెస్ అయినప్పుడు అతన్ని సారధ్య బాధ్యతల నుంచి తప్పించాలి అనే ఆలోచన అసలు రాదు. కానీ ఇటీవల ముంబై ఇండియన్స్ యాజమాన్యం మాత్రం ఇలాంటి ఆలోచన చేసి భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఊహించని షాక్ ఇచ్చింది అని చెప్పాలి.


 అప్పటివరకు టైటిల్ గెలవడంలో మిగతా జట్లతో పోల్చి చూస్తే వెనుకబడిపోయిన ముంబై ఇండియన్స్ జట్టు తలరాతను మార్చేశాడు రోహిత్ శర్మ. ఒక సాదాసీదా ఆటగాడిగా జట్టులోకి వచ్చి ఏకంగా ఇక కెప్టెన్ గా అవతరించాడు. అంతేకాదు ముంబై ఇండియన్స్ ను జీరో నుంచి హీరో టీం వరకు కూడా తీసుకొచ్చాడు రోహిత్ శర్మ. ఏకంగా ఐదుసార్లు టైటిల్ అందించి తన కెప్టెన్సీకి తిరుగులేదు అని నిరూపించాడు.  రోహిత్ ఐదు సార్లు కెప్టెన్సీ అందించినందుకు అయినా అతని మీద గౌరవంతో ఇక రిటైర్మెంట్ అయ్యేవరకు కెప్టెన్గా కొనసాగించడం చేస్తారు ఎవరైనా.


 కానీ ఇంకా అతను కెప్టెన్ గా కొనసాగుతుండగానే ఆకస్మాత్తుగా ముంబై ఇండియన్స్ యాజమాన్యం అతన్ని సారధ్య బాధ్యతలనుంచి తప్పించింది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించింది. దీంతో ఈ విషయంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రోహిత్ ఫ్యాన్స్ అందరు కూడా ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ లాంటి కెప్టెన్ ను మళ్ళీ చూడలేము అని.. ఇకపై ముంబైకి మద్దతు ఇవ్వము అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఇంత జరుగుతున్న రోహిత్ మాత్రం మౌనంగా ఉండడంతో కాస్త కన్ఫ్యూజన్ నెలకొంది అని చెప్పాలి. రోహిత్ స్పందన కోసం అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: