బిసిసిఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించింది అన్న విషయం తెలిసిందే. 2008లో ఒక సాదాసీదా దేశీయ లీగ్ గా ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇక ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్లో టి20 ఫార్మాట్ కి ఊహించని రీతిలో పాపులారిటీ రావడానికి అటు ఐపీఎల్ కారణం అనడంలోనూ సందేహం లేదు. అయితే దాదాపు 16 సీజన్లు పాటు ఇక ఎంతో సక్సెస్ఫుల్గా కొనసాగుతూ వచ్చింది ఇండియన్ ప్రీమియర్ లీగ్.


 ఇక ఈ లీగ్ కారణంగా ప్రతి ఏడాది అటు బీసీసీఐకి వేల కోట్ల ఆదాయం సమకూరుతుంది అనడంలో సందేహం లేదు. అంతేకాదు ఎంతో మంది యువ ఆటగాళ్లకు తమ సత్తా ఏంటో నిరూపించుకునేందుకు ఐపిఎల్ ఒక మంచి వేదికగా మారిపోయింది. అయితే ఐపీఎల్ సూపర్ సక్సెస్ కావడంతో ఈ టోర్నీ తరహాలోనే మరో కొత్త టోర్నీని ప్రారంభించాలని బిసిసిఐ భావిస్తుంది. ఇప్పటికే ఉమెన్స్ క్రికెట్ ను ప్రోత్సహించేందుకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ని ప్రారంభించింది. కాగా ఐపిఎల్ తరహాలోనే మరో ప్రతిష్టాత్మకమైన టోర్నిని ప్రారంభించబోతుందట బిసిసిఐ.


 టి20 ఫార్మాట్లో కాకుండా టీ10 ఫార్మాట్లో ఇక ఈ టోర్నీని మొదలు పెట్టాలని అనుకుంటున్నారట. సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఇక ఈ టోర్నీ నిర్వహించాలని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్తో పాటు విదేశాల్లోనూ ఈ రెండు నెలలు పెద్ద టోర్నిలేవి లేకపోవడం తో ఈ రెండు నెలల్లో కొత్త లీగ్ నిర్వహణకు అణువుగా ఉంటాయని బీసీసీఐ పెద్దలు అనుకుంటున్నారట. అయితే కొత్త టీ10 లీగ్ ఆరంభ దశ లోనే ఉన్నప్పటికీ స్పాన్సర్షిప్ల కోసం బడా కంపెనీలు ఎగబడుతున్నట్లు సమాచారం. జై షా కొత్త లీగ్ కాన్సెప్ట్ ను తెరమీదకి తీసుకురాగా బీసీసీఐ పెద్దలు కూడా సానుకూలంగా స్పందించారట. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: