2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం అన్ని జట్లు కూడా టైటిల్ గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో అటు ముంబై ఇండియన్స్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మాత్రం అందరిని షాకీ గురి చేసింది. ఏకంగా ముంబై ఇండియన్స్ జట్టుకి ఐదు సార్లు టైటిల్ అందించిన కెప్టెన్గా కొనసాగుతున్న రోహిత్ శర్మను.. సారధ్య బాధ్యతల నుంచి తప్పిస్తూ ఆ టీం యాజమాన్య నిర్ణయం తీసుకుంది. దీంతో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మని తప్పించడం ఏంటి అని క్రికెట్ ఫ్యాన్స్ అందరు కూడా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి.


అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు జరిగిన నేపథ్యంలో మిగతా టీమ్స్ కెప్టెన్సీ మార్పుపై కూడా చర్చలు తెరమీదకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. గత కొంతకాలం నుంచి జట్టుకు కెప్టెన్సీ వహిస్తూ సమర్థవంతంగా జట్టును ముందుకు నడిపించలేకపోతున్న ఆటగాళ్లను కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పించాలి అంటూ ఎంతో మంది మాజీ ప్లేయర్స్ కూడా సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తూ ఉన్నారు. ఇక ఇలాంటి రివ్యూలు ఇంటర్నెట్లో తెగ వైరల్ గా మారిపోతూ ఉన్నాయి అని చెప్పాలి.


 కాగా టీమిండియా మాజీ ఆటగాడు శ్రీశాంత్ సైతం ఇక ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా కొనసాగుతున్న సంజూ శాంసన్ ను సారధ్య బాధ్యతల నుంచి తప్పించాలి అంటూ సూచించాడు శ్రీశాంత్. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టుకి రోహిత్ శర్మ లాంటి నాయకుడు కావాలి. సంజు శాంసన్ కు నిలకడలేదు. జట్టులో సంజు తో పాటు చాలామంది ఆటగాళ్లను మార్చాలి  నేను రాయల్స్ కి ఆడేటప్పుడు కెప్టెన్ వ్యూహాత్మకంగా వ్యవహరించేవాడు. కానీ ఇప్పుడు సంజు అలా చేయట్లేదు. జాస్ బట్లర్ కెప్టెన్గా బాధ్యతలు చేపడితే బెటర్ అంటూ శ్రీశాంత్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: