ప్రస్తుతం భారత జట్టు వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. వరల్డ్ కప్ ముగిసిన వెంటనే సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ ఆడింది టీం ఇండియా. అయితే ఈ టి20 సిరీస్ లో విజయం సాధించి  శుభారంభం చేసింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా 4-1 తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది టీమిండియా. ఇక ఇప్పుడు అటు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే  దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా మూడు ఫార్మట్లలో కూడా సిరీస్ ఆడిపోతుంది టీమిండియా.


 ఇక ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టి20 సిరీస్ లు బరిలోకి దిగగా ఇక 1-1 తేడాతో ఈ సిరీస్ సమయం అయింది. కాగా నేటి నుంచి ఆతిథ్య దక్షిణాఫ్రికా తో వన్డే సిరీస్ మొదలుపెట్టబోతుంది టీమిండియా. ఈరోజు నుంచి దక్షిణాఫ్రికా భారత్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. ఇక ఈ వన్డే సిరీస్ లో భాగంగా అటు కేఎల్ రాహుల్ భారత జట్టుకు సారథ్యం వహించబోతున్నాడు. అదే సమయంలో ఇక ఎంతో మంది యువ ఆటగాళ్లకు కూడా భారత తుది జట్టులో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.


 కాగా తొలి వన్డే మ్యాచ్ జోహాన్నస్బర్గ్ వేదికగా జరగబోతుంది. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది అని చెప్పాలి. స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానల్, హాట్ స్టార్ యాప్ లో ఈ మ్యాచ్ వీక్షించవచ్చు. కాగా రోహిత్ కు విశ్రాంతి ప్రకటించిన నేపథ్యంలో   కేఎల్ రాహుల్ కు సారధ్య బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్ ప్లేయర్లు లేకుండానే వన్డే  సిరీస్ లో బరిలోకి దిగిపోతుంది టీమిండియా  మరి టి20 సిరీస్ లో పరవాలేదు అనిపించిన టీమిండియా.. వన్డే ఫార్మాట్ సిరీస్ లో ఎలా రాణిస్తుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: